Advertisementt

సలార్ సంక్రాంతి-కల్కి సమ్మర్

Sat 02nd Sep 2023 03:10 PM
salaar vs kalki  సలార్ సంక్రాంతి-కల్కి సమ్మర్
Salaar Sankranti-Kalki Summer సలార్ సంక్రాంతి-కల్కి సమ్మర్
Advertisement
Ads by CJ

సలార్ పోస్ట్ పోన్ న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ అయ్యింది. సెప్టెంబర్ 28 న సలార్ రావడం లేదు అనేది ఖచ్చితంగా కన్ ఫర్మ్ అయినట్లే కనిపిస్తుంది. మేకర్స్ నుండి క్లారిటీ లేకపోయినా.. యుఎస్ డిస్ట్రిబ్యూటర్స్ నుండి అందాల్సిన సంకేతాలు అందేస్తున్నాయి. దానితో సోషల్ మీడియాలో సలార్ పై పక్కా క్లారిటీ తో సలార్ పోస్ట్ పోన్ పై న్యూస్ లు వెలువడుతున్నాయి.

ప్రభాస్ మరో ప్యాన్ ఇండియా ఫిలిం కల్కి వచ్చే సంక్రాంతికి విడుదల అని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. అయితే మధ్యలో కల్కి డేట్ సమ్మర్ కి వెళ్లొచ్చనే న్యూస్ కూడా వినిపించింది. రాజమౌళి, తమ్మా రెడ్డి లాంటి వారు కల్కి డేట్ పై చేసిన కామెంట్స్ తో ఆ చిత్రం కూడా సంక్రాంతికి వచ్చే అవకాశం లేదు అని తేలిపోయింది. అయితే ఇప్పుడు పోస్ట్ పోన్ అంటున్న సలార్ సంక్రాంతికి షిఫ్ట్ అయితే.. కల్కి సమ్మర్ లో వచ్చే అవకాశం ఉంది అని టాక్.

సలార్ సిజి వర్క్ పూర్తి కాకపోవడంతో సలార్ మేకర్స్ సినిమాని సెప్టెంబర్ బరి నుండి తప్పించి కూల్ గా సంక్రాంతి ఫెస్టివల్ కి దించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కల్కి కూడా విఎఫెక్స్ వర్క్ లేట్ అవడంతో సంక్రాంతి నుండి సమ్మర్ షిఫ్ట్ అవుతుంది అని సమాచారం ఉండడంతో సలార్ మేకర్స్ ఈ రకమైన ఆలోచన చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఈ విషయమై స్పష్టత వచ్చేవరకు ప్రభాస్ ఫాన్స్ కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు. 

Salaar Sankranti-Kalki Summer:

Salaar vs Kalki

Tags:   SALAAR VS KALKI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ