సూపర్ స్టార్ మహేష్ ఫ్యామిలిలో జరిగిన పెళ్లికి మహేష్ తో పాటుగా ఆయన వైఫ్ నమ్రత కలిసి హాజరైన వీడియోస్, పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గోడ మీదున్న హ్యాంగర్ కి ఉన్న చొక్క వేసుకొచ్చినా మహేష్ ఎంతో హ్యాండ్ సమ్ గా కనిపించినట్టుగానే.. ఈసారి ఫ్యామిలీ వెడ్డింగ్ లోను మహేష్ మెరిసిపోయాడు. నమ్రత వైట్ కలర్ మోడ్రెన్ అవుట్ ఫిట్ లో దేవతలా కనిపించింది. మహేష్ బాబుకి దగ్గర బంధువులు ఘట్టమనేని వారింట్లో నిన్న శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ పెళ్ళికి ప్రముఖులు, రాజకీయనేతలు హాజరయ్యారు.
అదే పెళ్ళిలో మినిస్టర్ రోజా సందడి చేసారు. రోజా మహేష్ బాబు తో సరదాగా మాట్లాడిన తర్వాత సెల్ఫీలతో హంగామా చేసారు. రోజా సూపర్ స్టార్ మహేష్ తో కలిసి దిగిన సెల్ఫీ వైరల్ గా మారింది. ఇక మహేష్ ఈరోజు నుండి గుంటూరు కారం కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ లో మొదలు కాబోయే యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొంటారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సంక్రాంతి టార్గెట్ గా తెరకెక్కుతుంది.