Advertisementt

OG Glimpse: వామ్మో.. ఏంటీ అరాచకం?

Sun 03rd Sep 2023 11:11 AM
og glimpse,pawan kalyan,sujeeth,s thaman,hbd pawan kalyan  OG Glimpse: వామ్మో.. ఏంటీ అరాచకం?
Pawan Kalyan OG Glimpse Out OG Glimpse: వామ్మో.. ఏంటీ అరాచకం?
Advertisement
Ads by CJ

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన OG గ్లింప్స్ వచ్చేసింది. మొదటి నుంచి మేకర్స్ ఇస్తున్న హైప్‌ని మించేలా ఈ గ్లింప్స్ ఉందంటే అస్సలు అతిశయోక్తి కానే కాదు. మరీ ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టామినాని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పే సినిమా ఇదనే ఫీల్‌ని ఈ చిన్న గ్లింప్స్ ఇస్తుంటే.. దీనిపై మేకర్స్ ఎంతగా మనసు పెట్టారో అర్థం చేసుకోవచ్చు. 

‘పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుఫాన్ గుర్తుందా? అది మట్టి, చెట్లతో పాటు సగం ఊరినే ఊడ్చేసింది. కానీ, వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం.. ఇప్పటికీ ఏ తుఫాన్ కడగలేకపోయింది. అలాంటోడు మళ్లీ తిరిగి వస్తున్నాడూ అంటే..’ అనే డైలాగ్‌ను ఓ పవర్ ఫుల్ వాయిస్ చెబుతుంటే.. బ్యాక్‌గ్రౌండ్‌లో వేటాడే చీతా సాంగ్.. ఇంతకంటే ఏం కావాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఏ తరహా చిత్రమైతే కోరుకుంటున్నారో.. అది ఇదే అని కన్ఫర్మ్‌గా ఈ గ్లింప్స్‌తో చెప్పేయవచ్చు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఒకదానికి మించి ఒకటి పోటీ పడుతున్నట్లున్నాయి. ఇక OG ఎంట్రీ సీన్ మాములుగా ప్లాన్ చేయలేదు. ఇప్పుడు ఫ్యాన్స్‌కి సుజీత్ కనబడితేనా.. పాలాభిషేకాలు ఖాయం. అలా ఇచ్చిపడేశాడీ ఓజీ గ్లింప్స్. 

అర్జున్ దాస్ వాయిస్ ఓవర్, థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. పవన్ కళ్యాణ్ ఎంట్రీ.. ఇలా ఒక్కటేమిటీ.. గ్లింప్స్ చూసిన తర్వాత ఫ్యాన్స్‌కి అయితే తేరుకోవడానికి కనీసం 10 నిమిషాల టైమ్ పడుతుంది. అలా ఉంది గ్లింప్స్. దానయ్యగారూ.. ఇక బిజినెస్ షురూ చేయండి. ఈసారి అన్నీ లెక్కలు తేలిపోవాలి. ఇదిరా పవన్ కళ్యాణ్ స్టామినా అని ప్రతి ఒక్కడికి తెలిసిరావాలి. ఓజీ అక్కడ ఓజీ. ఒకే ఒక్క మాట.. దొమ్మల్ అదిరిపోతున్నాయ్..

Pawan Kalyan OG Glimpse Out:

OG Glimpse Creates Sensation

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ