పవన్ కళ్యాణ్ కి బ్రో ఎంత షాకిచ్చిందో తెలియదు కానీ.. పవన్ ఫాన్స్ మాత్రం బాగా డిస్పాయింట్ అయ్యారు. బ్రో చిత్రంతో ఆయన్ని రీమేక్స్ చెయ్యొద్దని వేడుకుంటున్నారు. పవన్ కి ఏం పోయింది.. ఆయన రెమ్యునరేషన్ ఆయన పట్టుకుపోతారు. లాభమైనా, నష్టమైనా నిర్మాతలే భరిస్తారు. సరే ఇప్పుడు ఆయన బర్త్ డే వచ్చేసింది. ఒక పక్క గుడుంబా శంకర్ రీ రిలీజ్, మరోపక్క OG టీజర్ రాకతో ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక ఆగిపోయింది అనుకుంటున్న హరి హర వీరమల్లు నుండి ఆయన బర్త్ డే స్పెషల్ గా పోస్టర్ వదులుతున్నారు.
పవన్ బర్త్ డే కి ఇంత మంచి ట్రీట్స్ సిద్ధమవుతుంటే ఇప్పుడు షాకేందుకు అనుకుంటున్నారా.. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తో సురేందర్ రెడ్డి సినిమా కోసం ఆఫీస్ ఓపెనింగ్ చేసి అప్ డేట్ ఇవ్వడంతో పవన్ ఫాన్స్ లో ఆందోళన మొదలయ్యింది. ఏజెంట్ తో అఖిల్ కి బిగ్గెస్ట్ డిసాస్టర్ ఇచ్చాడు, తప్పంతా దర్శకుడిదే.. ప్రోపర్ స్క్రిప్ట్ లేక ఫెయిల్ అయ్యామంటూ నిర్మాత అనిల్ సుంకర మొత్తం సురేందర్ రెడ్డి మీదే తోసేసాడు. అలాంటి దర్శకుడికి పవన్ కళ్యాణ్ అవకాసం ఇవ్వడం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని పవన్ ఫాన్స్ ఫీలవుతున్నారు.
ఎప్పుడో సురేందర్ రెడ్డితో పవన్ కళ్యాణ్ కమిట్ అయ్యి మూవీ ప్రకటించినా అది మధ్యలో ఆగిపోయిందనే టాక్ నడిచింది. కానీ ఇప్పుడు పుట్టిన రోజుకి ఒక్క రోజు ముందు సురేందర్ రెడ్డి.. నిర్మాత రామ్ తాళ్లూరిలు పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఆఫీస్ తీసి పూజా కార్యక్రమాలను నిర్వహించడంతో పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఒక్కసారిగా షాకైపోతున్నారు.