కోలీవుడ్ లో తెరకెక్కిన జైలర్ మూవీ ప్యాన్ ఇండియా ఫిలింగా విడుదలై దాదాపుగా ఆరు వందల కోట్లు కొల్లగొట్టింది. ప్రతి భాషలోనూ జైలర్ మూవీ హవా కొనసాగింది. సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ తెరకెక్కించిన ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోయిజం, ఆయన స్టయిల్, అనిరుద్ మ్యూజిక్, శివ రాజ్ కుమార్, మోహన్ లాల్ ల గెస్ట్ రోల్స్ అన్ని జైలర్ ని విజయతీరానికి చేర్చాయి. తమిల్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం మిగతా భాషల్లో స్లోగా పికప్ అయ్యింది.
అయితే జైలర్ తో తనకి 100ల కోట్ల లాభాలు తెచ్చిపెట్టినందుకు గాను సన్ పిక్చర్స్ అధినేత సూపర్ స్టార్ రజినీకాంత్ కి, దర్శకుడు నెల్సన్ దిలీప్ కి అదిరిపోయే గిఫ్ట్ లేమిటి.. ఇంకా అదనంగా చెక్ లు ఇవ్వడం అందరిని ఆకర్షించింది. నిన్న గురువారం సూపర్ స్టార్ రజినీకాంత్ ని కలిసి సన్ పిక్చర్ అధినేత పారితోషకం కాకుండా ఇంకా కొన్ని కోట్లు సూపర్ స్టార్ కి చెక్ రూపంలో బహుమతిగా ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది.
కాసేపటికే.. ఆయన సూపర్ స్టార్ ఇంటికి వెళ్లి రెండు లగ్జరీ కార్లని చూపిస్తూ ఏదో ఒకటి చూజ్ చేసుకోమని రజినీకాంత్ ని కోరిన వీడియో అదే లెవల్లో వైరల్ అయ్యింది. ₹1.24 కోట్ల విలువగల BMW x7 కారు ని సూపర్ స్టార్ కి గిఫ్ట్ గా ఇచ్చారు. నిజంగా ఈ గిఫ్ట్స్ ఆయనకి నథింగ్ అయినా.. వేరే లెవల్ అనేలా ఉన్నాయి. కోలీవుడ్ నుండి మిగతా అన్ని భాషల్లోను ఇప్పుడు సూపర్ స్టార్ కి ఇచ్చిన చెక్, మరియు కారు గురించి అందరూ చెప్పుకుంటున్నారు.