మంచు ఫ్యామిలిలో లుకలుకలన్నీ ఎప్పుడో రోడ్డెక్కాయి.. మంచు విష్ణు తమ ఫ్యామిలిలో ఎలాంటి గొడవ లేదంటాడు కానీ.. మంచు ఫ్యామిలీలో జరిగే ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. మంచు మనోజ్ పెళ్లి విషయంలో, ఆస్తుల విషయంలో మంచు విష్ణు కాస్త వ్యతిరేఖంగా ఉన్నాడనే న్యూస్ ఎప్పటినుండో వినిపిస్తుంది. అందుకే అక్క లక్ష్మి ఇంట్లోనే మంచు మనోజ్ మౌనిక మెడలో తాళి కట్టాడంటారు .
ఇక వారి మద్యన గొడవలు ఆ మధ్యన మీడియాలో హైలెట్ అవగా అవన్నీ ఓ రియాలిటి షో కోసమంటూ మంచు విష్ణు కవర్ చేసే యత్నం చేసాడు. మనోజ్ పెళ్ళిలో నామమాత్రంగా కనిపించిన విష్ణు ని మంచు లక్ష్మి, మనోజ్ ఇద్దరూ పక్కనబెట్టేశారా అనిపించేలా తాజాగా లక్ష్మి రాఖీ సీలెబ్రేషన్స్ ఉన్నారు. మనోజ్ కి రాఖి కట్టి అతని భార్య మౌనికతో కలిసి రెస్టారెంట్ లో సెలెబ్రేట్ చేసుకున్న పిక్స్ ని మంచు లక్ష్మి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అవి చూసిన నెటిజెన్స్ ఏంటి లక్ష్మి విష్ణుని వదిలేసి మనోజ్ తో రాఖీ పండగని సెలెబ్రేట్ చేసుకున్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రేమ, సరదా, మంచి భోజనంతో రాఖీని సెలెబ్రేట్ చేసుకున్నామంటూ మంచు లక్ష్మి ఆ రెస్టారెంట్ పిక్స్ పోస్ట్ చేసింది.. మరి మనోజ్ కి రాఖీ కట్టి విష్ణు ని ఎందుకు అవాయిడ్ చేసిందో లక్ష్మి.