ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుండి రాబోతున్న ప్యాన్ ఇండియా ఫిలిం సలార్ పోస్ట్ పోన్ అవ్వబోతుంది అంటూ సోషల్ మీడియాలో #postpone హాష్ టాగ్ ట్రెండ్ అవుతుంది. అందుకే సలార్ ట్రైలర్ లాంచ్ గురించి ఇంతవరకు మేకర్స్ ప్రకటించలేదు.. చాలా టైట్ గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుంది.. సిజి వర్క్ పట్ల దర్శకుడు అసంతృప్తిగా వున్నారని మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ అది గనక ఓ కొలిక్కి రాకపోతే సలార్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ వుంది అంటూ ఒక్కసారిగా సోషల్ మీడియాలో సలార్ పై న్యూస్ లు జోరందుకున్నాయి.
మరి సలార్ ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 28 నే రిలీజ్ అంటూ గత ఆరు నెలలుగా మేకర్స్ ఢంకా పదంగా చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా సలార్ పోస్ట్ పోన్ అంటూ వార్తలు రావడంతో ప్రభాస్ ఫాన్స్ డిస్పాయింట్ మోడ్ లోకి వెళ్లిపోతున్నారు. అసలే ట్రైలర్ రాక కోసం ఎదురు చూస్తున్న వారికి ఈన్యూస్ మరింతగా కలవరపడేలా చేసింది.
కొన్ని షాట్లు మళ్లీ వర్క్ చెయ్యమని ఇచ్చారని.. అవి రావడం బట్టి, విడుదల డేట్ వుంటుందని తెలుస్తోంది. మోస్ట్ లీ రావడం కష్టమే అని బెంగుళూరు వర్గాల టాక్.. అంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ కనబడుతున్నాయి.
అయితే మరికొద్దిసేపట్లో సలార్ పోస్ట్ పోన్ పై అధికారిక ప్రకటన రాబోతుంది అంటున్నారు. దానితో పాటుగా కొత్త రిలీజ్ డేట్ అతి త్వరలోనే మేకర్స్ ప్రకటిస్తారంటున్నారు. మరి నిజంగానే సలార్ పోస్ట్ పోన్ అవ్వబోతుందా.. లేదంటే యాంటీ ఫాన్స్ ఎమన్నా గాలి వార్త పుట్టించారా అనేది మేకర్స్ ఈ న్యూస్ పై క్లారిటీ ఇస్తే బావుంటుంది.