Advertisementt

ఎన్టీఆర్ వార్ 2 రిలీజ్ డేట్ లాక్

Fri 01st Sep 2023 11:47 AM
war2  ఎన్టీఆర్ వార్ 2 రిలీజ్ డేట్ లాక్
War 2 released date locked ఎన్టీఆర్ వార్ 2 రిలీజ్ డేట్ లాక్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిందీ డెబ్యూట్ వార్ 2 పై అంచనాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి సోషల్ మీడియా పరిశీలిస్తే తెలుస్తుంది. హ్రితిక్ రోషన్ వార్ 2 లో ఎన్టీఆర్ కీలక పాత్రలో ఆయన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన వార్ 2 షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. నవంబర్ నుండి ఎన్టీఆర్ వార్ 2 సెట్స్ లోకి వెళతాడని టాక్ ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. 

అనుకోకుండా వార్ 2 రిలీజ్ డేట్ అంటూ ఓ పోస్టర్ సోషల్ మీడియాలో దర్శనమిస్తుంది. ఈ చిత్రం 2025 జనవరి 24న విడుదలవుతోంది అంటూ మేకర్స్ పోస్టర్ విడుదల చేసి మరీ హ్రితిక్ అభిమానులకి, ఎన్టీఆర్ అభిమానులకి స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చారు. అయితే ఈ పోస్టర్ ఒరిజినాల.. లేదంటే ఫేక్ అనేది క్లారిటీ ఎల్దు. అలాగే మేకర్స్ అఫీషియల్ గా చెప్పలేదు. ఈ పోస్టర్ ద్వారా నజీర్ అనే పాత్రలో ఎన్టీఆర్, కబీర్ అనే పాత్రలో హృతిక్ కనిపించనున్నట్టుగా చిత్ర బృందం కన్ ఫామ్ చేసింది. 

ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ లో కనిపిస్తాడని.. వీరిద్దరికి స్పెషల్ గా హీరోయిన్స్ లేకపోయినప్పటికీ.. స్పెషల్ సాంగ్ కోసం, అలాగే కొన్ని పాత్రల కోసం బాలీవుడ్ క్రేజీ హీరోయిన్స్ ని ఆయన్ ముఖర్జీ రంగంలోకి దింపనున్నాడని తెలుస్తోంది. 

War 2 released date locked :

Interesting Developments in War 2

Tags:   WAR2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ