విజయ్ దేవరకొండ-సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఖుషి మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడంతో సినిమాపై మొదటి నుండి అంచనాలు ఏర్పడ్డాయి. ఖుషి షూటింగ్ మొదలు పెట్టి చాలా కాలమైనా సమంత హెల్త్ ఇస్స్యూస్ తో అది ఆలస్యమవుతూ ఎట్టకేలకు నేడు థియేటర్స్ లో సందడి చెయ్యడానికి రెడీ అయ్యింది ఖుషి. మరి టక్ జగదీశ్ తో సో సో హిట్ కొట్టిన శివ కి, లైగర్ మూవీతో ప్లాప్ కొట్టిన విజయ్ కి, శాకుంతలం తో డిసాస్టర్ మోడ్ లో ఉన్న సమంతకి ఖుషి చిత్రం ఎలాంటి రిజల్ట్ కట్టబెట్టిందో అనేది ప్రీమియర్స్ టాక్ లో చూసేద్దాం.
ఖుషి ఓవర్సీస్ టాక్ ఎలా ఉంది అంటే.. దేవుడంటే నమ్మకం లేని నాస్తిక తండ్రి, ఓ బ్రాహ్మణ తండ్రికి మధ్య జరిగే కథ ఖుషి. రెగ్యులర్ స్టోరి, కొంత నిడివి సాగదీసినట్టు అనిపించింది.. ఎంటర్‌టైన్‌మెంట్, చివరి 30 నిమిషాలు సినిమా బాగుంది. అక్కడక్కడ కథ ఊగిసలాడినట్టు అనిపిస్తుంది. ఎమోషనల్ కంటెంట్ వర్కవుట్ అయింది అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. హిట్టు కోసం విజయ్ దేవరకొండ చూసిన ఎదురు చూపులకు ఫలితం దక్కింది. ఐదేళ్ల తర్వాత భారీ హిట్టుకొట్టాడు.. అంటూ విజయ్ అభిమాని సోషల్ మీడియాలో ట్వీట్ చేసాడు.
ఖుషి మూవీ యావరేజ్. టక్ జగదీస్ కంటే బెటర్ సినిమా. హృదయాన్ని తేలికపరిచే సినిమా. శివ నిర్వాణ ఇచ్చే ఎమోషనల్ టచ్ మిస్ అయింది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 5 ఏళ్ల తర్వాత స్ట్రాంగ్‌గా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఖుషి మూవీ సెకండాఫ్ ఎక్సలెంట్. ది కింగ్ ఈజ్ బ్యాక్. ది విజయ్ దేవరకొండ అంటూ ఓ నెటిజన్ ట్వీటేసాడు. చివరి 30 నిమిషాలు సీన్లు ఎమోషనల్‌గా ఉండటమే కాకుండా కేక పెట్టించేలా ఉన్నాయి.
సాంగ్స్, విజయ్ దేవరకొండ యాక్షన్. సమంత ఫెర్ఫార్మెన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, చివరి 30 నిమిషాలు హైలెట్. బైక్ సీన్ బాగలేదు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.. మరి పబ్లిక్ నుండి ఈ మాత్రం పాజిటివ్ టాక్ వస్తే చాలు సినిమా హిట్టే.. అంటూ విజయ్ దేవరకొండ అభిమానులు డిసైడ్ అవుతున్నారు.