గత కొన్ని రోజులుగా భర్త చైతన్య కి విడాకులిచ్చేస్తున్న మెగా డాటర్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన నిహారిక జూన్ నెలలో తన భర్తతో సపరేట్ అవుతున్నట్లుగా ప్రకటించింది. ఆ తర్వాత వరుణ్ తేజ్ నిశ్చితార్థంలో సందడి చేసింది. చరణ్ కి అమ్మాయి పుట్టినప్పుడు అపోలో ఆసుపత్రిలో మేనకోడలిని మెగా ప్రిన్స్ పుట్టింది అంటూ మాట్లాడిన నిహారిక కొద్దిరోజులుగా తరచూ సోషల్ మీడియాలో కనబడుతుంది. విడాకుల తర్వాత నటనపై దృష్టి పెట్టినట్లుగా కనిపించింది.
ఈరోజు మెగా ఫ్యామిలిలో రక్షా బంధన్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి పూజ గదిలో ఆయన చెల్లెళ్ళు ఇద్దరూ చిరుకి రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత రామ్ చరణ్ కి ఆయన చెల్లెళ్లు రాఖీ కట్టిన పిక్స్ బయటికి రాకపోయినా.. నిహారిక చరణ్ కి రాఖీ కట్టిన వీడియో వైరల్ గా మారింది.
రామ్ చరణ్ నిహారిక తల మీద చెయ్యి పెట్టి ఆశీర్వదిస్తుండగా.. ఆ చేతికి నిహారిక రాఖీ కట్టింది.. ఆ వీడియోలో సుష్మిత కూడా కనిపిస్తుంది. రాఖీ కట్టాక చెల్లెలు నిహారికతో రామ్ చరణ్ ఫొటోలకి ఫోజులిచ్చాడు. అలాగే వరుణ్ తేజ్ కి రాఖీ కట్టి అన్నతో ప్రేమగా పిక్ దిగి పోస్ట్ చేసింది నిహారిక.