మరో మూడురోజుల్లో మొదలు కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 7 పై ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించేందుకు కింగ్ నాగార్జున చెయ్యని ప్రయత్నం లేదు. బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమోస్ తో అందరిలో ఇంట్రెస్ట్ కలిగిస్తున్నారు. ఈసారి ఎవ్వరి ఊహలకి అందని విధంగా బిగ్ బాస్ ఉండబోతుంది.. ఉల్టా-పుల్టా అంటూ చెబుతున్నారు. అలాగే కొత్త కొత్త మొహాలు ఈసారి బిగ్ బాస్ లో కనబడతాయట.
బిగ్ బాస్ సీజన్స్ 4,5,6 అంతగా వర్కౌట్ కాలేదు. టీఆర్పీలు కూడా ఆ మూడు సీజన్స్ కి బాగా తగ్గాయి. బిగ్ బాస్ లో ఏం జరుగుతుందో.. కంటెస్టెంట్స్ ఎలా ప్రవర్తిస్తారో అనే విషయాలు ముందే తెలిసిపోవడం, శనివారం ఎలిమినేషన్ ప్రోగ్రాం మొత్తం ముందే లీకైపోవడం, సండే ఎలిమినేట్ అవ్వాల్సిన వాళ్ల పేర్లు ముందే బయటికి రావడం, అలాగే నైట్ పది గంటల వరకు బిగ్ బాస్ ని స్టార్ మాలో ప్రసారం చెయ్యకపోవడం.. ఇవన్నీ షో పై క్రేజ్ తగ్గడానికి కారణమయ్యాయి.
ఒకప్పుడు పల్లెటూరి జనాలు కూడా బిగ్ బాస్ ని చూసేవారు. కానీ బిగ్ బాస్ పది గంటలకు ప్రసారమవడంతో విలేజర్స్ కి ఇంట్రెస్ట్ తగ్గింది. కారణం పడుకునే సమయం కాబట్టి.
శని, ఆది వారాలు రాత్రి తొమ్మిది గంటలకే ప్రసారమయ్యే బిగ్ బాస్ ఈ సీజన్ ని మిగతా రోజుల్లో అంటే వర్కింగ్ డేస్ లో రాత్రి పది గంటల వరకు వెయిట్ చెయ్యక్కర్లేకుండా 9.30 కే ప్రసారం చేస్తున్నారు.. గంటపాటు అంటే 10.30 వరకు బిగ్ బాస్ వస్తుంది. శని,ఆదివారాలు యధావిధిగా 9 నుండి 10. వరకు ప్రసారమవుతుంది. ఈలెక్కన ఈ సీజన్ కొత్తగా ఉండడమే కాదు. టైమింగ్ పరంగాను వర్కౌట్ అవడం గ్యారెంటీగా కనబడుతుంది.