Advertisementt

ఇతర భాషల్లో ఖుషి పరిస్థితి

Thu 31st Aug 2023 03:37 PM
kushi  ఇతర భాషల్లో ఖుషి పరిస్థితి
Kushi situation in other languages ఇతర భాషల్లో ఖుషి పరిస్థితి
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ-సమంత ల ఖుషి విడుదలకు సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఖుషి పై తెలుగు రాష్ట్రాలులో ఎంతగా అంచనాలున్నాయో అనేది బుక్ మై షో చూస్తే తెలుస్తుంది. కానీ ఇతర భాషల్లో మాత్రం అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ చెప్పేదానిని బట్టే డిసైడ్ అవుతుంది.

ఇతర భాషల్లో విడుదలవుతున్న ఖుషి మూవీ పరిస్థితి ఎలా ఉందంటే.. తమిళంలో ఖుషి పై అంతగా అంచనాలు లేవు అంటున్నారు. చెన్నైలో తెలుగు వెర్షన్ కి టికెట్స్ తెగుతున్నా తమిళ వెర్షన్ కి ఇప్పటివరకు టికెట్స్ బుకింగ్స్ లేవు అంటూ మాట్లాడుకుంటున్నారు. మరోపక్క మలయాళం, కన్నడ భాషల్లోనూ పరిస్థితి ఇలానే ఉందంటూ రిపోర్ట్స్ అందుతున్నాయి. 

బెంగుళూరు లాంటి నగరాల్లో తెలుగు ప్రేక్షకులు ఖుషి ని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నా కన్నడ వెర్షన్ చూసేందుకు అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ప్రమోషన్స్ అంతగా లేకపోవడమే ఖుషి కి బుకింగ్స్ లేకపోవడానికి ప్రధాన కారణమంటున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఖుషి కి బుకింగ్స్ ఓపెన్ అయినా.. అంతంతమాత్రంగానే టికెట్స్ తెగుతున్నాయి. మరి ఖుషి ఈలెక్కన ఓపెనింగ్ ఫిగర్స్  చెప్పుకునే విధంగా ఉంటాయో.. లేదో.. చూద్దాం. 

Kushi situation in other languages:

Kushi bookings week for other languages

Tags:   KUSHI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ