నయనతార ఇప్పటివరకు సోషల్ మీడియాలో కనిపించలేదు. ఆమె ఎప్పుడూ సోషల్ మీడియాకి దూరంగానే ఉండేది. నయనతార విషయాలన్నింటిని గత కొన్నేళ్ళుగా విగ్నేష్ శివన్ సోషల్ మీడియా ఖాతాల నుండే బయటికి వచ్చేవి. ఆమె వెకేషన్ కి వెళ్లినా.. భర్త తో కలిసి ఉన్నా, రీసెంట్ గా పిల్లలతో ఆడుకుంటున్న పిక్స్ ఇలా ఏదైనా విగ్నేష్ శివన్ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుండే ప్రపంచానికి తెలిసేవి. సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్న నయనతార మొదటిసారి ఇన్స్టాగ్రామ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది.
అది కూడా తన కొడుకులు ఉయర్, ఉలగం లతో కలిసి ఆడుకుంటున్నా వీడియో ని మొదటిసారి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అద్భుతమైన ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు తన కొడుకుల మొహాలని ప్రపంచానికి చూపించని నయనతార మొదటిసారి ఇన్స్టా పేజీ లో తన కొడుకుల వీడియోని షేర్ చేసి కొడుకులని ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసింది.
కెరీర్ స్టార్ట్ చేసి ఎన్నో ఏళ్ళవుతున్నా ఇంతవరకు సోషల్ మీడియాలో కనబడని నయనతార మొదటిసారి ఓ కొత్త హ్యాండిల్ నుండి కనిపించేసరికి అభిమానులు ఖుషి అవుతున్నారు. వెల్ కమ్ కన్మణి అంటూ ఆమెకి కామెంట్స్ పెడుతున్నారు. ఇన్నాళ్ళకి నయన్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన పిల్లలతో కలిసి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఎంట్రీ సీన్ కు జవాన్ సినిమాలోని ఓ సాంగ్ కూడా జత చేసింది. ఇప్పుడు ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది.