మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఐఆరెస్ అధికారి సచిన్ సావంత్ విచారణలో పలు కీలక విషయాలను బయటపెట్టారు. ఆయన మనీ లాండరింగ్ కి పాల్పడినట్లుగా ఈడీ గుర్తించడంతో ఆయన్ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టగా.. పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సచిన్ సావంత్ మలయాళ నటి నవ్య నాయర్ తో స్నేహం చేసి ఆమెకి బోలెడన్ని బహుమతులని ఇచ్చినట్టుగా తెలియడంతో అధికారులు నవ్య నాయర్ కి నోటీసులు జారీ చేసి ఆమెని విచారించేందుకు ముంబై పిలిచారు.
సచిన్ సావంత్ వాట్సాప్ చాట్ లో అతనికి నవ్య నాయర్ తో సంబంధాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఆమెని కలవడానికి సచిన్ సావంత్ చాలాసార్లు కొచ్చిన్ కి వెళ్ళినట్లుగా.. సచిన్ సావంత్ కి-నవ్య నాయర్ కి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించడమే కాకుండా పక్కా ఆధారాలను సేకరించిన అధికారులు ఆమెని విచారించగా.. తనకు సచిన్ సావంత్ మనీ లాండరింగ్ కి ఎలాంటి సంబంధము లేదని, స్నేహానికి గుర్తుగా తనకి ఆయన కొన్ని గిఫ్ట్స్ ఇచ్చినట్లుగా నవ్య అధికారులు తెలిపినట్లుగా తెలుస్తోంది.
సచిన్ నవ్య నాయర్ తోనే కాకుండా తమ కుటుంభ సభ్యుల పేరు మీద అనేక రకాల ఆస్తులని కూడబెట్టినట్లుగా తెలుస్తుంది. పెద్ద పెద్ద భవంతులు కొన్నట్లుగా తెలుస్తుంది. అయితే నవ్య నాయర్ వాంగ్మూలాన్ని కోర్టుకి సమర్పించేందుకు ఈడీ ఛార్జ్ షీటు జత చేసింది.