ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్-ప్యాన్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ పార్ట్ 1 సెప్టెంబర్ 28 న రిలీజ్ అవుతుంది. సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కింది. కానీ ఆ స్థాయి ప్రమోషన్స్ మాత్రం కనిపించడం లేదు అంటూ ప్రభాస్ ఫాన్స్ చాలా ఫీలవుతున్నారు. రిలీజ్ కి నెల రోజులు కూడా లేదు.. కానీ మేకర్స్ ఇప్పటివరకు ట్రైలర్ విషయం తేల్చకపోయేసరికి సలార్ టీం పై ట్రోల్స్ మొదలయ్యాయి.
ఇప్పటివరకు సలార్ దర్శకనిర్మాతలు ట్రైలర్ డేట్ ఇవ్వకుండా సైలెన్స్ ని మైంటైన్ చేస్తున్నారు. దానితో ఫాన్స్ ఆందోళనపడుతున్నారు. అయితే మేకర్స్ ఆ సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ సెప్టెంబర్ 6 న సలార్ ట్రైలర్ రిలీజ్ చెయ్యాలని, సినిమా విడుదలవుతున్న అన్ని భాషల్లోను సలార్ ట్రైలర్ ని ఒకేసారి విడుదల చెయ్యాలనుకుంటున్నారట. అసలైతే సలార్ ట్రైలర్ సెప్టెంబర్ 7 న విడుదల చేద్దామని మేకర్స్ భావించినా.. అప్పుడు సోషల్ మీడియా మొత్తం జవాన్ హడావిడి ఉంటుంది.
అప్పుడు సలార్ కి కొంత క్రేజ్ తగ్గే అవకాశం ఉంది అందుకే ఒకరోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 6 నే సలార్ ట్రైలర్ విడుదల చేస్తారట. ఒక్కసారి ట్రైలర్ వస్తే.. సినిమాపై ఇప్పటివరకు ఉన్న అంచనాలు ఒక ఎత్తు.. ఇకపై పెరిగే అంచనాలు మరొక ఎత్తు అన్నట్టుగా ఉంటుందని ప్రభాస్ ఫాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబరు 28న సలార్ వరల్డ్ వైడ్ రికార్డు స్క్రీన్లలో రిలీజ్ కాబోతోంది.