రేపు శుక్రవారం విడుదల కాబోతున్న విజయ్ దేవరకొండ-సమంత ఖుషి మూవీ ప్రమోషన్స్ పై టాలీవుడ్ లో పెద్ద చర్చే జరుగుతుంది. లైగర్ సినిమా విషయంలో విజయ్ దేవరకొండ అంత హడావిడి చేసాడు. కానీ ఇప్పుడు ఖుషి మూవీ ప్రమోషన్స్ ని లైట్ తీసుకుంటున్నాడు. సమంత కూడా లేదు. విజయ్ దేవరకొండ ఏదో కొత్తగా ట్రై చేస్తున్నా.. ఈసాదాసీదా ప్రమోషన్స్ ఈ కాలంలో ఏం సరిపోతాయనే భావనలో ప్రేక్షకులు ఉన్నారు.
ఇక రేపు శుక్రవారం విడుదలవుతున్న ఖుషి పై మంచి అంచనాలున్నాయి. కానీ ప్రమోషన్స్ వీక్. ఏదో ట్రైలర్ లాంచ్ అంటూ విజయ్ హంగామా, మ్యూజికల్ నైట్ అంటూ సమంత-విజయ్ దేవరకొండ డాన్స్ అలాగే ఓ ఇంటర్వ్యూ తప్పితే ఖుషి ని ప్రేక్షకుల్లోకి అంతగా పంపలేదు. ఇక ఆడియో లాంచ్, లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడం అనేది ప్రతి చిన్న, పెద్ద సినిమాలకి కొన్నేళ్ళుగా పాటిస్తున్న ట్రెండ్.
కానీ ఖుషి కి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ, ఆడియో లాంచ్ కానీ లేదు.. సినిమా రిలీజ్ కి వచ్చేసింది. ఇది చూస్తుంటే విచిత్రంగా ఉంది. హా సమంత లేదుగా నేను మాత్రం ఇంకేం ప్రమోట్ చేస్తానులే అన్నట్టుగా విజయ్ తీరు ఉంది. ఇక సారధి స్టూడియో లో ఫాన్స్ మీట్ అంటూ ఏదో హడావిడి తప్పితే ఇంకేమి కనిపించలేదు. మరి ఈ ఎఫెక్ట్ ఖుషి ఓపెనింగ్స్ మీద ఖచ్చితంగా పడుతుంది. హిట్ అయితే ఓకె.. లేదంటే సోషల్ మీడియా పరిస్థితి తెలుసుగా.. తొక్కిపారేస్తారు.