అమెజాన్ ప్రైమ్ లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై.. తర్వాత ప్యాన్ ఇండియా ప్రేక్షకుల నుండి శెభాష్ అనిపించుకున్న రాజ్ అండ్ డీకే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ ని మెగాస్టార్ మిస్ చేసుకున్నారనే న్యూస్ మెగా అభిమానులని ఫీలయ్యేటట్టు చేసింది. హిందీలో రాజ్ అండ్ డీకే త్రయం మనోజ్ బాజ్ పాయ్ - ప్రియమణి వంటి నటులతో కీలక పాత్రలగా తెరకెక్కించిన ఫ్యామిలీ మ్యాన్ సీరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో.. దానికి పార్ట్ 2 గా వచ్చిన సీరీస్ లో సమంత లాంటి అగ్రతార నెగెటివ్ షేడ్స్ లో కనిపించడం మరింత అంచనాలు పెరిగేలా చేసింది. మనోజ్ బాజ్ పాయ్ రా ఏజెంట్ గా టెర్రరిస్టులని పట్టుకోవడం, అటు ఫ్యామిలితో పడే కష్టాలు అన్ని ఆ సీరీస్ ని పాపులర్ చేసాయి.
అయితే ఇప్పడు ఆ హిట్ సీరీస్ ని మెగాస్టార్ మిస్ చేసుకున్నారు అనే విషయాన్ని టాప్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ రివీల్ చేసారు. తాజాగా ఆయనొక ఛానల్ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరు తో ఫ్యామిలీ మ్యాన్ ని మూవీగా తీసేందుకు రాజ్ అండ్ డీకే నన్ను కలిసి చిరుకి కథ వినిపించగా.. చిరంజీవి గారు ఇద్దరు పిల్లల తండ్రిగా, వేరేవేరే ఆలోచనలున్న భార్య ఇలాంటివి ప్రేక్షకులు మెచ్చరేమో.. కొద్దిగా మారిస్తే బావుంటుంది అని అన్నారు. అప్పటికే ఆయన సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి ఖైదీ నెంబర్ 150 సక్సెస్ తో ఎంజాయ్ చేస్తున్నారు.. ఇక ఫ్యామిలీ మ్యాన్ స్క్రిప్ట్ మార్చమని అడగడం.. ఇంకా కొన్ని కారణాల వలన మెగాస్టార్ దానిని పక్కనబెట్టారు.
ఆ తర్వాత రాజ్ అండ్ డీకే లు దానిని సీరీస్ గా మార్చారు అంటూ చెప్పుకొచ్చారు. మరి మనోజ్ చేసిన పాత్రలాంటి పాత్ర చిరు చేసినట్టయితే ఖచ్చితముగా ప్రేక్షకులు మెచ్చేవారే. ఈ విషయం తెలిసాక చిరు ఆ హిట్ స్క్రిప్ట్ ని వదులుకున్నారు అంటూ మెగా ఫాన్స్ కాస్త గట్టిగానే ఫీలవుతున్నారు.