ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి 2898AD మూవీ ఇప్పుడు ప్యాన్ వరల్డ్ బడా మల్టీస్టారర్ గా రెడీ అవుతుంది. పెద్ద పెద్ద స్టార్స్ ఇందులో భాగమవుతున్నారు. కమల్ హాసన్, అమితాబ్, దీపికా పదుకొనె, దిశా పటాని లాంటి క్రేజీ స్టార్స్ కల్కిలో నటించడంతో ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. యుఎస్ లో శాండియాగోలో జరిగిన కామికాన్ ఈవెంట్ లో కల్కి పోస్టర్ అండ్ గ్లిమ్ప్స్ లాంచ్ తోనే ప్రపంచం మొత్తం కల్కి వైపు చూసేలా చేసారు మేకర్స్.
అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో ప్యాన్ ఇండియా దర్శకుడు రాజమౌళి కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎస్.ఎస్ రాజమౌళి ఈ చిత్రంతో అతిధి పాత్రలో కనిపించబోతున్నారట. కల్కి టైటిల్ గ్లిమ్ప్స్ పై అప్పట్లో రాజమౌళి వేసిన ట్వీట్ విపరీతంగా వైరల్ అయ్యింది. ఇప్పుడు ఈ చిత్రంలో రాజమౌళి కనిపిస్తారనే న్యూస్ మరింతగా ట్రెండ్ అవుతుంది.
అయితే ఈవార్త ఇంతగా పాపులర్ అవుతున్నా.. కల్కి మేకర్స్ నుండి ఎలాంటి స్పష్ఠత లేదు. మరోపక్క ఈ చిత్రంలో మలయాళ స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్ కూడా భాగమయ్యాడనే న్యూస్ నడిచింది. ఈ విషయంపైన కూడా క్లారిటీ లేదు. ఇక కల్కి చిత్రం రెండు భాగాలుగా విడుదలకాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి పండగ స్పెషల్ గా విడుదల చేసేందుకు డేట్ లాక్ చేసారు మేకర్స్.