నిన్న మీడియాలో ఒక్కసారిగా నటి వరలక్ష్మి శరత్ కుమార్ కి డ్రగ్స్ కేసులో భాగంగా NIA అధికారులు నోటీసులు పంపించారు.. వరలక్ష్మి దగ్గర పని చేసే పిఎ అదిలింగం ఆల్రెడీ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవడంతో.. వరలక్ష్మి కి కూడా అతను డ్రగ్స్ సప్లై చేసాడు అనే అనుమానంతో వరలక్ష్మి ని విచారించేందుకు అధికారులు సమన్లు పంపించారనే న్యూస్ విపరీతంగా సర్క్యులేట్ అయ్యింది. అయితే ఈ వార్తలు వచ్చిన కొద్ధి గంటల్లోపే వరలక్ష్మి రియాక్ట్ అయ్యింది.
తనకు NIA అధికారులు సమన్లు పంపించారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. తనపై వస్తున్న ఆరోపణలు నిజం కాదని స్పష్టం చేసింది. తన దగ్గర ఆదిలింగం అనే వ్యక్తి ఫ్రీ లాంచ్ మేనేజర్ గా చేరిన మాట వాస్తవమే.. అది ఎప్పుడో మూడేళ్ళ క్రితం మాట. అతను మూడేళ్ళ క్రితం నా దగ్గర పని చేసి మానేసాడు. ఇప్పుడు ఆదిలింగం ఎవరి దగ్గర పని చేస్తున్నాడో కూడా తెలియదు. ప్రస్తుతం ఆదిలింగంతో ఎలాంటి కమ్యూనికేషన్ లేదు.
మీడియాలో డ్రగ్స్ పై వస్తున్న వార్తలు చూసి షాకయ్యను. నాకు NIA అధికారులు నాకు ఎలాంటి సమన్లు పంపించలేదు. అవరసరమైతే అధికారులని తప్పకుండా కలుస్తాను.. అసలు ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధము లేదు అంటూ వరలక్ష్మి శరత్ కుమార్ తనపై వస్తున్న ఆరోపణలపై సోషల్ మీడియా ద్వారా స్పందించింది.