పాపం ప్రభాస్ ఫాన్స్ పరిస్థితి చూస్తే జాలేస్తుంది.. అంటూ మిగతా హీరోల ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా జాలి చూపించేస్తున్నారు. కారణమేమిటంటే.. సలార్ విడుదల కావడానికి ఇంకా నెల టైం మాత్రమే ఉంది. అందులో ఒకరోజు అయ్యిపోయింది. సలార్ సెప్టెంబర్ 28 న విడుదల అంటూ పదే పదే అప్ డేట్స్ ఇస్తూ వచ్చిన మేకర్స్ ఇప్పుడు సలార్ ట్రైలర్ విషయం తేల్చడంలేదు. సలార్ ట్రైలర్ సూన్ అంటూ అభిమానుల హడావిడి తప్ప అధికారిక ప్రకటన లేదు.
అయితే ఈలోపులో ప్రభాస్ ఫాన్స్ ని చూసి కొంతమంది యాంటీ ఫాన్స్ ఇలా ట్వీట్లు వేస్తున్నారు. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ లు రిలీజ్ అయ్యి, అవి పోయినప్పుడు కూడా next Salaar ఉందిలే గట్టిగా కొడతాం అనుకొని hopes తో ఉన్నారు ఫ్యాన్స్, ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అయోమయం లో ఉన్నారు. #Salaar నుండి No updates, రోజు రోజుకీ సినిమా మీద ఇంట్రెస్ట్ పోతుంది, రిలీజ్ దగ్గరకు వస్తుంది. 😕🙆 అంటూ ట్వీట్లు వేస్తున్నారు.
మరి ప్యాన్ ఇండియా ఫిలిం ప్రమోషన్స్ ఎలా ఉంటే ప్రేక్షకులకి రీచ్ అవుతుందో.. ఎలా ఉండాలో అనేది ఈమధ్య కాలంలో చాలామంది ఎగ్జామ్పుల్స్ చూపిస్తున్నారు. అంతెందుకు ప్రభాస్ బాహుబలి అప్పుడు ఇండియా మొత్తం ఎలా తిరిగాడు, దర్శకుడు ప్రశాంత్ నీల్ KGF అప్పుడు ఏం చేసారు. కానీ సలార్ విషయంలో అలా జరగడం లేదు.. అదే ప్రభాస్ ఫాన్స్ బాధ. మధ్యలో ఈ యాంటీ ఫాన్స్ నుంచి ఇలాంటి సెటైర్స్.. వారిని మరింత బాధపెడుతున్నాయి.