Advertisementt

గుంటూరు కారం నుండి అందుకే తప్పుకున్న పూజ

Tue 29th Aug 2023 06:19 PM
pooja  గుంటూరు కారం నుండి అందుకే తప్పుకున్న పూజ
Reason behind Pooja leaving Guntur Kaaram గుంటూరు కారం నుండి అందుకే తప్పుకున్న పూజ
Advertisement
Ads by CJ

త్రివిక్రమ్ కి లక్కీ హీరోయిన్ గా మారిన పూజ హెగ్డే ని తన తదుపరి సినిమా గుంటూరు కారం లో మహేష్ కి జోడిగా కంటిన్యూ చేస్తున్నట్లుగా.. ఆ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడే చెప్పారు ఆయన. మహేష్-పూజ హెగ్డే జోడి గుంటూరు కారంలో కన్ ఫర్మ్ అని. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ లోకి సెకండ్ హీరోయిన్ గా శ్రీలీల వచ్చి చేరింది. గుంటూరు కారంలోకి అడుగుపెట్టకముందే పూజ హెగ్డే కి బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ లు పడాయి. 

బాలీవుడ్ లో పూజ హెగ్డే కి వరసగా ఎదురు దెబ్బలు తగలడంతో ఆమె ని అన్ లక్కీగా భావిస్తున్న సమయంలో పూజ హెగ్డే ని గుంటూరు కారం నుండి తప్పించారనే న్యూస్ వైరల్ అయ్యింది. ఓ మూడు నెలలు అదే ప్రచారం జరిగింది.. ఫైనల్ గా పూజ ప్లేస్ లోకి మీనాక్షి చౌదరి వచ్చేసింది. అయితే తివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ నుండి పూజ హెగ్డే ని తప్పించారా.. లేదంటే పూజానే కావాలని తప్పుకుందా అనే విషయం తెలియలేదు.

తాజాగా పూజ హెగ్డే కావాలనే గుంటూరు కారం నుండి తప్పుకుందట. కారణం ఆమె కాలుకి మేజర్ సర్జరీ చేయించుకుంది అని తెలుస్తోంది. పూజ హెగ్డే బీస్ట్, రాధే శ్యామ్ షూటింగ్స్ అప్పటి నుండే కాలి నెప్పితో బాధపడుతుంది. గత ఏడాది ఓ రెండు మూడు నెలలు కాలికి కట్టుతో నడవలేని స్థితిలో కనబడింది. అయితే ఆ నెప్పి మధ్యలో తగ్గినా తర్వాత మళ్ళీ నెప్పి తిరగబెట్టడంతో డాక్టర్స్ ఆమెకి సర్జరీ ప్రిఫర్ చేశారట. పూజ హెగ్డే ఆ సర్జరీ వలనే పలు ప్రాజెక్ట్స్ నుండి తప్పుకుంది అనేది ఆమె సన్నిహితులు చెబుతున్న మాట. మరి అందుకే గుంటూరు కారం నుండి కూడా పూజ తప్పుకుని ఉండొచ్చు. 

Reason behind Pooja leaving Guntur Kaaram:

Pooja walked out for this reason from Guntur Kaaram

Tags:   POOJA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ