తెలంగాణ సీఎం కేసీఆర్ బాటలోనే తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నడవబోతున్నారంటూ ఏపీలో బీభత్సంగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఏపీలో విజయం సాధించడం టీడీపీకి అత్యవసరం. ఈసారి ఆ పార్టీ విజయానికి చాలా అవకాశం ఉంది. అంతేకాదు.. టీడీపీ కూడా తమ పార్టీ విజయానికి అవసరమైన ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. అయితే ఈ క్రమంలోనే చంద్రబాబు రాంగ్ స్టెప్స్ వేస్తున్నారా? ఇప్పటికే సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఆయన భయపడుతున్నారనే సంకేతాలను జనంలోకి తీసుకెళ్లింది. ఇప్పుడు అదే నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు సైతం భయపడబోతున్నారంటూ టాక్ నడుస్తోంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయబోతున్నానంటూ ప్రకటించేశారు. దీంతో కేసీఆర్ భయపడిపోయారు. అందుకే ఒకచోట ఓడిపోయినా మరోచోట గెలవచ్చనే ఆలోచనతోనే రెండు చోట్ల పోటీ చేయబోతున్నారంటూ తెలంగాణలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఏపీలోనూ చంద్రబాబు కూడా రెండు చోట్ల పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో నిజమెంతో కానీ ఆయన కుప్పంలో ఓడిపోతాననే భయంతోనే రెండు చోట్ల పోటీకి సిద్ధమవుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. నిజానికి గత ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు తొలి రెండు రౌండ్లలో స్వల్పంగా వెనుకబడిపోయారు. ఇక ఇప్పుడు అధికార పార్టీ ఎలాగైనా చంద్రబాబును ఓడించాలనే కృతనిశ్చయంతో ఆ బాధ్యతలను పెద్దిరెడ్డికి అప్పగించింది.
ఇక టీడీపీ సైతం రాష్ట్రంలో అధికారం కోసం ప్రణాళికలు రచిస్తోంది. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు శతవిధాలుగా యత్నిస్తోంది. ఇక వైసీపీ ముందుగా టీడీపీని కుప్పంలోనే దెబ్బకొట్టాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే అటు పెద్దిరెడ్డి.. ఇటు కుప్పం ఇన్‌చార్జి భరత్ కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో కుప్పంలో టీడీపీని దెబ్బకొట్టింది. ఈసారి దెబ్బకొట్టేందుకు దైనికైనా సిద్ధమవుతున్నారు. భారీగా ఓట్లను గల్లంతు చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు భయపడ్డారని.. అందుకే కుప్పంతో పాటు పోటీకి మరో నియోజకవర్గాన్ని ఎంచుకుంటున్నారని అధికార పార్టీ జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది. మరీ ఈ ప్రచారం జనాల్లోకి వెళ్లకముందే టీడీపీ బాస్ మెలుకుని ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.