మినిస్టర్ రోజా భర్త సెల్వమణి పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ వారి చేసింది చెన్నై కోర్టు. పరువు నష్టం కేసులో సెల్వమణి కోర్టుకి పదే పదే హాజరుకాకపోవడంతో చెన్నై జ్జర్జ్ టౌన్ కోర్టు సెల్వమణికి అరెస్ట్ వారెంట్ జారీ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. సెల్వమణి గతంలో పలు సినిమాలకి దర్శకత్వం వహించారు. తమిళనాడుకి చెందిన ముకుంద్ చంద్ బాత్రా అనే ఫైనాన్షియర్ ఓ కేసులో 2016 లో అరెస్ట్ అయ్యాడు.
అయితే సెల్వమణి ఓ ఛానల్ లో తాను ముకుంద్ చాంద్ వలన ఇబ్బందులు పాలయ్యానంటూ మట్లాడడంతో.. ముకుంద్ చాంద్ సెల్వమణి మాటలు తన పరువుకు నష్టం కలిగించేవిలా ఉన్నాయంటూ సెల్వమణిపై పరువు నష్టం కేసు వేసాడు. ఈ కేసు నడుస్తూ ఉండగానే ముకుంద్ చాంద్ మరణించారు. అయినప్పటికీ ముకుంద్ చాంద్ కొడుకు ఈకేసుని కొనసాగిస్తున్నారు.
అయితే కోర్టు విచారణలో ఉన్న ఈ కేసు పలుమార్లు వాయిదాలు పడి విచారణ కోనసాగుతూ ఉన్నా సెల్వమణి మాత్రం కోర్టుకి హాజరు కాకపోవడంతో చెన్నై లోని జార్జ్ టౌన్ కోర్టు సెల్వమణిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.