గుంటూరు కారం షూటింగ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. మహేష్ బాబు విదేశాల నుండి తిరిగి వచ్చాక ఓ ప్రోడక్ట్ ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్న తర్వాత గుంటూరు కారం సెట్స్ లోకి వెళ్లిపోయారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న గుంటూరు కారం షూటింగ్ విషయంలో నిన్నటివరకు అయోమయంలో ఉన్న మహేష్ అభిమానులు కాస్త రిలాక్స్ అవుతున్నారు. సంక్రాంతికి సినిమా వస్తుందా, లేదా అనేది చాలామందిలో ఉన్న అనుమానం.
కానీ మహేష్ బాబు, మేకర్స్ గుంటూరు కారం ఖచ్చితంగా సంక్రాంతికే రిలీజ్ అని గట్టిగా చెబుతూ వస్తున్నారు. అందుకు అనుగుణంగానే తాజాగా షూటింగ్ జరుగుతుంది. సెప్టెంబర్ 1 నుండి మొదలు కాబోయే యాక్షన్ సీక్వెన్స్ లో మహేష్ బాబు అలాగే జగపతి బాబు పై ఓ ఎపిసోడ్ ని త్రివిక్రమ్ చిత్రీకరిస్తారట. జగపతి బాబు గుంటూరు కారం లో స్టైలిష్ విలన్ గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.
టాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ల సారథ్యంలో త్రివిక్రమ్ తన మార్క్ ఇంట్రెస్టింగ్ యాక్షన్ సీన్ ని డిజైన్ చేసినట్లుగా తెలుస్తుంది. మహేష్ కూడా త్రివిక్రం కి సపోర్ట్ చేస్తూ ఉండడంతో అనుకున్న సమయానికే గుంటూరు కారం షూటింగ్ పూర్తి చేసి విడుదల చేస్తారంటున్నారు. ఈ చిత్రంలో మహేష్ కి జోడిగా శ్రీలీల మెయిన్ లీడ్ లో కనిపిస్తుండగా.. మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా కనిపించబోతుంది.