నందమూరి నటసింహ బాలయ్య బాబు వారసుడు వచ్చేస్తున్నాడు.. అభిమానులు మీరు సెలెబ్రేషన్స్ కి సిద్దమైపొండి అన్నట్టుగా మోక్షజ్ఞ రీసెంట్ లుక్ ఉంది. ఎప్పుడెప్పుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తాడా అని 2018 నుండి నందమూరి అభిమానులు ఎదురు చూడని రోజు లేదు. బాలయ్య కూడా కొడుకు ఎంట్రీ గురించి ఇదిగో అదిగో అంటూ చెప్పడమే కానీ.. అది జరగలేదు. అటు చూస్తే మోక్షజ్ఞ ఎప్పుడుచూసినా కూడా బరువుగా కనిపించడం అభిమానులను బాగా డిస్పాయింట్ చేసేది.
కానీ మోక్షజ్ఞ తాజా లుక్ చూసాక అభిమానులు మాత్రం ఫుల్ ఖుషిగా ఫీలవుతున్నారు. హీరోలా కనిపించాడు.. ఇకపై తెరంగేట్రమే తరువాయి అంటూ మాట్లాడుకుంటున్నారు. గత వారం రోజులుగా మోక్షజ్ఞ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాడు. సుహాసిని కొడుకు పెళ్ళిలో ఎన్టీఆర్ తో కలిసి పిక్స్ దిగడం, హాగ్ చేసుకోవడం ఇలా ప్రతి అంశము నందమామూరి అభిమానులని ఇంప్రెస్స్ చేసింది.
ఇక రెండు రోజుల క్రితం తండ్రి నటిస్తున్న భగవంత్ కేసరి సెట్స్ లో శ్రీలీల తో కలిసి కనిపించాడు. అలాగే నిన్న తాతగారు స్మారక నాణేం లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. తండ్రితో మోక్షజ్ఞ ఎయిర్ పోర్ట్ లో నడిచొస్తున్న క్లిప్పింగ్స్ వైరల్ అయ్యాయి. గతంలో రేర్ గా కనిపించిన మోక్షజ్ఞ.. ఈమధ్య కాలంలో ఎక్కువగా మీడియాకి దర్శనమిస్తున్నాడు. అంటే హీరోగా లాంచ్ అవడానికి సమయం దగ్గరపడబట్టే మోక్షజ్ఞ లుక్స్, స్టయిల్, మీడియాలో కనిపించడం అన్ని అందులో భాగమే అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.