యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల కాంబోలో క్రేజీ ప్యాన్ ఇండియా ఫిలిం గా తెరకెక్కుతున్న దేవర మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా జరుగుతుంది. శంషాబాద్ ఏరియాలో వేసిన పలు రకాల సెట్స్ లో దేవర షూటింగ్ ని చక చకా కొరటాల పూర్తి చేస్తున్నారు. యాక్షన్ ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇంటర్వెల్ కి ముందు వచ్చే యాక్షన్ సీన్ అదిరిపోతోంది అనే ప్రచారం ఎప్పటినుండో ఉంది. ఆ సీన్ అండర్ వాటర్ లో ఉండబోతుంది అని చెప్పారు.
ఇప్పుడు దానికి సంబందించిన స్పెషల్ ట్రైనింగ్ ని ఎన్టీఆర్ తీసుకుంటున్నాడట, సముద్రం బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కుతున్న దేవర మూవీలో ఒకటి రెండు అండర్ వాటర్ ఫైట్స్ ఉన్నప్పటికీ.. ఇంటర్వెల్ ముందు వచ్చే సముద్రపు యాక్షన్ సీక్వెన్స్ కీలకమని దీనికోసమే ఎన్టీఆర్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడట, ముంబై నుంచి వచ్చిన స్పెషల్ అండర్ వాటర్ ట్రైనర్లు ఎన్టీఆర్ కి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారట. ఎన్టీఆర్ ప్రస్తుతం ఈ శిక్షణలో ఉన్నాడట.
కొరటాల కూడా ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా దేవర స్క్రిప్ట్ ప్రకారమే షూటింగ్ చిత్రీకరణ చేస్తున్నాడట. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా.. షూటింగ్ సాఫీగా సాగిపోతుంది అని తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్-ఎన్టీఆర్ కి మధ్యన వచ్చే భారీ యాక్షన్ సీక్వెన్స్ ఇప్పటికే పూర్తి చేశారట కొరటాల. దేవర షూటింగ్ నవంబర్ కల్లా ఓ కొలిక్కి వస్తుంది అని.. ఆ అర్వాత సమయమంతా.. సిజి వర్క్ కి కేటాయిస్తారని తెలుస్తోంది.