ప్రమోషన్స్ లేకపోయినా జైలర్ హిట్ అవ్వలేదా? కంటెంట్ ఉంటే ప్రమోషన్స్ అవసరం లేదు.. ప్రేక్షకులు వాళ్ళే థియేటర్స్ కి వచ్చేస్తారని కొంతమంది ఇండస్ట్రీ జనాలు అనుకుంటున్నారట. అసలు ఓటిటీ ప్రాచుర్యం పెరిగాక ప్రమోషన్స్ లేకపోతే దానిని థియేటర్స్ లో చూసే దిక్కు లేదు. ఆ విషయం మేకర్స్ కి తెలుసు. సూపర్ స్టార్ లాంటి సినిమాకి ప్రమోషన్స్ లేకపోయినా.. మౌత్ టాక్ తో జనాలు వచ్చినా వస్తారు. కానీ మీడియం రేంజ్ స్టార్స్ కి ప్రమోషన్స్ చేసుకోకపోతే, అందులోను ప్లాప్ లో ఉన్న హీరో ప్రమోషన్స్ వదిలేస్తే.. కథ వేరేలా ఉంటుంది.
సినిమా రిలీజ్ అయ్యాక పబ్లిక్ టాక్ ని బట్టి సినిమా కోసం థియేటర్స్ కి ఆడియన్స్ కదులుతారనే అభిప్రాయంలో ఉంటే.. ఓపెనింగ్స్ ఎలా వస్తాయి. మినిమం సినిమా ప్రమోషన్స్ ఉంటేనే కదా బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చేవి.. సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది సినిమాలకి ప్రమోషన్స్ అవసరం లేదు అని భావిస్తున్నారట.
వారెవరో కానీ.. రాజమౌళి బాహుబలికి, ఆర్.ఆర్.ఆర్ చేసిన ప్రమోషన్స్ కారణంగానే అవి అంత పెద్ద హిట్ అయ్యాయి అని వారికీ తెలియదా.. రాజమౌళి ఆ రేంజ్ ప్రమోషన్స్ చెయ్యకపోతే టాలీవుడ్ అంటే ఎవరికీ తెలియదు. ప్యాన్ ఇండియా ఫిలిమ్స్ కి బలం ప్రమోషన్స్.. అది తెలుసుకుంటే బావుంటుంది.