రీసెంట్ గా ప్రకటించిన నేషనల్ అవార్డ్స్ లో అల్లు అర్జున్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం.. ఎన్టీఆర్-రామ్ చరణ్ కి అవార్డు రాకపోవడంపై ఫాన్స్ నుంచి పలు విమర్శలు వచ్చాయి. ఎన్టీఆర్-రామ్ చరణ్ అభిమానులు చాలా ఫీలయ్యారు. ఆర్.ఆర్.ఆర్ లో ఎన్టీఆర్-చరణ్ లు భీమ్ - రామరాజు పాత్రలతో హాలీవుడ్ ప్రముఖులతో పొగిడించుకున్నారు. కానీ నేషనల్ అవార్డు మాత్రం పుష్ప రాజ్ తన్నుకుపోవడం ఆయా హీరోల అభిమానులకి రుచించలేదు. బెస్ట్ యాక్టర్ కేటగిరిలో ఎన్టీఆర్-రామ్ చరణ్-అల్లు అర్జున్ సమ ఉజ్జీలే.
నేషనల్ అవార్డు కమిటీ మెంబెర్స్ ఉద్దేశ్యం ప్రకారం ఆర్.ఆర్.ఆర్ హీరోలకే నేషనల్ బెస్ట్ అవార్డు ఇవ్వాలనుకున్నారట. ఎన్టీఆర్-రామ్ చరణ్ లలో ఎవరో ఒకరికి నేషనల్ అవార్డు ఇవ్వాలని అనుకున్నప్పటికీ.. ఇదరికి కలిపి ఇవ్వలేని పరిస్థితి. అలాగే ఎన్టీఆర్ పాత్రకి జాతీయ ఉత్తమనటుడి అవార్డు ఇస్తే.. చరణ్ పాత్రని తక్కువ చేసినట్టుగా అవుతుంది.. చరణ్ కి ఇస్తే ఎన్టీఆర్ ని తక్కువ చెయ్యాలి.. ఆ సినిమా విజయంలో ఈ హీరోలిద్దరూ ససమానంగా కష్టపడ్డారు, భాగస్వాములయ్యారు. కానీ పుష్ప విజయాన్ని, కష్టాన్ని, కలెక్షన్స్ ని ఒంటి చేత్తో మోశాడు అల్లు అర్జున్. సింగిల్ హ్యాండ్ తో ప్యాన్ ఇండియా మర్కెట్ ని షేక్ చేసాడు. ప్రతి భాషలో కోట్లు కొల్లగొట్టాడు. ముఖ్యంగా ఎలాంటి అంచనాలు లేకుండా నార్త్ లో 100కోట్ల క్లబ్బులో కాలు పెట్టాడు. పుష్ప విజయం వెనుక అల్లు అర్జున్ ఒక్కడే ఉన్నాడు.
ఆర్.ఆర్.ఆర్ కి ఎన్టీఆర్-రామ్ చరణ్ లు ఇద్దరు హీరోలు.. ముఖ్యంగా అందులో మేజర్ పార్ట్ రాజమౌళిది. ఆయన కూడా వన్ అఫ్ ద హీరోనే. ఆయన ప్యాన్ ఇండియా బ్రాండ్ ఆర్.ఆర్.ఆర్ విజయంలో కీలకమని చెప్పాలి. ఇలా ఎన్టీఆర్-చరణ్-రాజమౌళి ఏ ఒక్కరికో నేషనల్ అవార్డు ఇచ్చి అందులో ఏ ఒక్కరిని తక్కువ చెయ్యలేక సింగిల్ హ్యాండ్ తో తన చిత్రానికి విజయం సొంతం చేసిన అల్లు అర్జున్ కి ఈ నేషనల్ అవార్డు ప్రకటించింది కమిటీ అనేది ఇన్ సైడ్ సమాచారం.