మొహమాటానికి పొతే ఏదో వచ్చినట్టుగా.. మెగాస్టార్ చిరంజీవి ఎప్పటినుండో ఫ్యామిలిలో ఉంటున్నాడు, అందులోని దర్శకుడు అని రీమేక్ ఒప్పుకుంటే ఏం జరిగిందో చూసారు. ఓ తుప్పు పట్టిన కథని తీసుకొచ్చి రీమేక్ సినిమా చేద్దామంటే.. మోహమాటానికిపోయి సరే అన్న పాపానికి మెగాస్టార్ చిరంజీవి ఆయన ఫాన్స్ ముందే పరువు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భోళా శంకర్ సినిమాతో సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వాల్సి వచ్చింది. ఆచార్య సినిమా పోయినా.. అంతగా బాధపడని మెగాస్టార్ భోళా శంకర్ డిసాస్టర్ దెబ్బకి కామ్ అవ్వాల్సి వచ్చింది. కారణం.. అంతగా ఆయనపై సోషల్ మీడియాలో పనిగట్టుకుని నెగిటివిటి చూపించడమే.
దానితో ఆయన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చెయ్యాలనుకున్న బ్రో డాడీ రీమేక్ కూడా ఆపేసినట్లుగా వార్తలొచ్చాయి. ఇప్పుడొక కుర్ర దర్శకుడు ఓ ఫ్రెష్ రీమేక్ కథ అని మెగాస్టార్ చిరు దగ్గరకి వెళితే.. కథ కూడా వినడానికి ఇష్టపడని చిరు రీమేక్ చెయ్యను అని మొహమాటం లేకుండా చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి. నిజమే కదా ఏదో మొహమాటానికిపోయి ఒప్పుకుంటే ఏమవుతుందో ఆయనకి బాగా అనుభవంలోకి వచ్చేసింది అందుకే నో చెప్పారు.
మెగాస్టార్ ఫ్రెష్ కథలతో, ఆయన వయసుకి తగిన పాత్రలతో సినిమాలు చెయ్యాలని మెగా అభిమానుల కోరిక. అందులో భాగంగానే మెగాస్టార్ చిరు బింబిసార దర్శకుడు వసిష్ఠ చెప్పిన కథ నచ్చబట్టే ఆయన బర్త్ డే కి అఫీషియల్ అనౌన్సమెంట్ ఇప్పించారని తెలుస్తోంది. తన కూతురుతో చెయ్యబోయే మూవీకి స్ట్రయిట్ కథతోనే సినిమా చేసేందుకు దర్శకుడి వేటలో ఉన్నారట.