రేపు శుక్రవారం విడుదల కాబోతున్న ఖుషి ప్రమోషన్స్ నామ మాత్రంగా కనబడుతుంటే.. సెప్టెంబర్ 7న విడుదల కాబోతున్న మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి సినిమా ప్రమోషన్స్ మాత్రం ఫుల్ స్వింగ్ లో నడుస్తున్నాయి. ప్రమోషన్స్ టూర్, ఇంటర్వూస్ అంటూ నవీన్ పోలిశెట్టి గత పది రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలోనే కనబడుతున్నాడు. హీరోయిన్ అనుష్క ప్రమోషన్స్ కి దూరంగా ఉన్నప్పటికీ.. నవీన్ పోలిశెట్టి మాత్రం సింగిల్ హ్యాండ్ తో కవర్ చేస్తున్నాడు. ఎక్కడ చూసినా వెనుక సినిమా పోస్టర్ దాని ముందు దర్శకుడు-నవీన్ పోలిశెట్టి, లేదంటే నవీన్ మాత్రమే సోలోగా కనబడుతున్నారు.
ఇక నవీన్ పోలిశెట్టి ఎక్కడికెళ్లినా అనుష్క ప్రమోషన్స్ కి రావడం లేదా అని అందరూ అదే ప్రశ్న రేజ్ చేస్తున్నారు. దానికి నవీన్ పోలిశెట్టి కవర్ చెయ్యలేక కష్టపడుతున్నాడు. అనుష్క పబ్లిక్ లోకి రాదు, ఆమె ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనదు, ఆమె మీడియా ముందుకు రాదు, ప్రెస్ మీట్ కి హాజరవదు.. పాపం నవీన్ ఒక్కడే చాలా కష్టపడుతున్నాడంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ కనబడుతున్నాయి.
ఇక నవీన్ పోలిశెట్టి మాత్రం అనుష్క ఎందుకు రాదు.. మొన్ననే ఓ ఇంటర్వ్యూ చేసాము. సుమ గారితో అనుష్క గారు నేను ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాము, అది రేపో ఎప్పుడో రిలీజ్ కాబోతుంది.. మొన్ననే TV9 ఇంటర్వ్యూ చేసాము, తర్వాత ఓ ఇంటర్వ్యూ చేస్తాము అని చెప్పాడు. అయినా మీడియా వారు మరి మీ ప్రమోషనల్ టూర్ లో అనుష్క జాయిన్ అవుతుందా అనగానే.. ఏమో అండి.. అది నాకు తెలియదు.. నేను చేస్తున్నాను. అయినా అనుష్క గారు అవుట్ ఆఫ్ స్టేషన్ అంటూ నవీన్ పోలిశెట్టి అనుష్క ప్రమోషన్స్ పై కవర్ చేసుకుంటూ కనిపిస్తున్నాడు.