Advertisementt

తిరుమలలో దేవర హీరోయిన్

Mon 28th Aug 2023 04:25 PM
janhvi kapoor  తిరుమలలో దేవర హీరోయిన్
Janhvi Kapoor visits Tirumala Temple తిరుమలలో దేవర హీరోయిన్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి దేవర ప్యాన్ ఇండియా మూవీ తో సౌత్ కి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్న జాన్వీ కపూర్ కి తిరుమల వెంకన్న స్వామి అంటే వల్లమాలిన ప్రేమ. ఆమె శ్రీదేవి బ్రతికున్న సమయంలోనే ఫ్యామిలీతో కలిసి తరచూ తిరుమల వెళ్లి వస్తూ ఉండేది. జాన్వీ కపూర్ ఎంతగా గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నా.. తిరుపతికి వస్తే ట్రెడిషనల్ గా లంగాఓణిలోకి మారిపోతుంది. పోయినసారి బాయ్ ఫ్రెండ్ తో కలిసి తిరుమలకి వచ్చిన జాన్వీ కపూర్ ఈసారి ఒంటరిగానే సింపుల్ గా వచ్చి స్వామివారిని దర్శించుకుంది. 

VIP బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకుని అనంతరం ఆమె మాడవీధుల్లో నడుచుకుంటూ వస్తూ మీడియా కంట పడింది. మరి మీడియా ఆగుతుందా జాన్వీ కపూర్ ని ఫొటోస్, వీడియోస్ తీస్తూ హడావిడి చేసింది. జాన్వీ కపూర్ కి తిరుపతి అంటే చాలా ఇష్టం అని పలు సందర్భాల్లో చెప్పింది. కుదిరితే తనకి ఇక్కడే పెళ్లి చేసుకోవడం ఇష్టమంటూ కూడా చెప్పుకొచ్చింది. 

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి దేవర మూవీలో నటిస్తున్న జాన్వీ కపూర్.. ఇప్పటికే దేవర సెట్స్ లో జాయిన్ అయినట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ విలన్ సైఫ్ అలీఖాన్ కి కూతురు పాత్రలో నటిస్తుంది. 

Janhvi Kapoor visits Tirumala Temple:

Devara Heroine Janhvi Kapoor visits Tirumala Temple

Tags:   JANHVI KAPOOR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ