ఈరోజు సోమవారం నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము విడుదల చేశారు. ఎన్టీఆర్ ఎంతో ప్రత్యేకమని, రాజకీయాల్లోనూ ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము అన్నారు. కృష్ణుడు, రాముడు వంటి పాత్రల్లో ఆయన నటన అద్భుతమని ప్రశంశించారు. ఈ వేడుకలో చంద్రబాబు ఆయన భార్య, బాలయ్య ఆయన భార్య, కొడుకు మోక్షజ్ఞ, చిన్న కుమార్తె తేజస్వి, రామకృష్ణ, పురందరేశ్వరి ఆమె భర్త.. అలాగే ఎన్టీఆర్ మిగతా కొడుకులు, కూతుళ్లు, ఫ్యామిలీ మెంబెర్స్ మనవళ్లు, మనవరాళ్లు అందరూ పాల్గొన్నారు.
నందమూరి ఫ్యామిలీతో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పిక్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఈవేడుకలో ఎన్టీఆర్ తో పాటుగా ఆయన అన్న కళ్యాణ్ రామ్ పాల్గొనకపోవడం చర్చినీయంశమైంది. అంతేకాకుండా.. నందమూరి ఫ్యామిలీ పిక్ లో బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మణి, లోకేష్ కూడా లేరు. కానీ ఆ పిక్ లో ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ లేకపోవడం మాత్రం నందమూరి అభిమానులని డిస్పాయింట్ చేసింది. అయితే ఎన్టీఆర్ దేవర షూటింగ్, కళ్యాణ్ రామ్ ఇతరత్రా కారణాలతో హాజరు కాలేదు అని తెలుస్తుంది.
ఇక ఎన్టీఆర్ కుటుంభ సభ్యులతో పాటుగా.. ఈ కార్యక్రమానికి టిడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, కింజరాపు రామ్మోహన్‌నాయుడు, గల్లా జయదేవ్, కేశినేని నాని, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు, బీజేపీ ఎంపీ సీఎం రమేశ్, మాజీ ఎంపీలు సుజనా చౌదరి, కంభంపాటి రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్‌కు సినీ, రాజకీయ రంగాల్లో సన్నిహితంగా మెలిగిన మరికొంతమంది హాజరయ్యారు.