లైగర్ ప్యాన్ ఇండియా ప్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ నుండి వస్తున్న చిత్రం ఖుషి. ఇది కూడా ప్యాన్ ఇండియా మార్కెట్ లోనే విడుదల కాబోతుంది. ఖుషి విడుదలకు జస్ట్ 4 డేస్ మాత్రమే సమయముంది. కానీ ఖుషి మూవీ ప్రమోషన్స్ మాత్రం కనిపించడం లేదు. లైగర్ విషయంలో దూకుడుగా సినిమాని ప్రమోట్ చేసిన విజయ్ దేవరకొండ ఖుషి ని ప్రమోట్ చేస్తున్న విధానం అంతగా ప్రేక్షకులకి టచ్ అవడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదో ప్యాన్ ఇండియా ప్రేక్షకులకి దగ్గరవ్వాలని విజయ్ ట్రై చేస్తున్నా.. అది ప్రమోషన్స్ లో కనిపించడం లేదు.
తెలుగు ప్రేక్షకుల కోసం ట్రైలర్ లాంచ్, మ్యూజికల్ నైట్ హంగామాతో ముగించేశారు. తర్వాత ఏవో కామన్ ఇంటర్వ్యూస్ అంటూ మీడియాలో కనబడుతున్నారు. ప్లాప్ లో ఉన్నా.. సక్సెస్ బాటలో ఉన్నా ప్రేక్షకుల్లోకి వెళ్ళడానికి చాలామంది హీరోలు కొత్తగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ విజయ్ దేవరకొండ ప్రభాస్ మాదిరిగా స్టార్ అనుకుంటున్నాడేమో.. ఒకటి రెండు ఈవెంట్స్ అంటూ ప్రమోషన్స్ ముగించేస్తున్నాడు.
లేదంటే సమంత తో మిడ్ నైట్ కాల్ ఏంటి.. ఆమెకి అమెరికాలో డే టైమే. ఇందులో వింతా లేదు విశేషమూ లేదు. దానిని కూడా పబ్లిసిటీ అనుకుంటే ఎలా.. సమంత కూడా విజయ్ మంచోడు అంటూ సర్టిఫికెట్స్ ఇవ్వడం ఏమిటి అంటూ నెటిజెన్స్ ఖుషి ప్రమోషన్స్ పై పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.