బాలీవుడ్ ముదురు భామ మలైకా అరోరా-కుర్ర హీరో అర్జున్ కపూర్ మధ్యన ఏం జరిగింది, ఏం జరుగుతుంది. వారిద్దరూ విడిపోయారా.. కలిసున్నారా.. ఇది అర్హం కాక కొద్దిమంది సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అర్జున్ కపూర్ పరిచయంతో భర్త అర్భాజ్ ఖాన్ కి విడాకులిచ్చేసి అర్జున్ కపూర్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న మలైకా అరోరా చాలాకాలం నుండి అర్జున్ కపూర్ తోనే కలిసి ఉంటుంది. కొద్దిరోజులు వీరి వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా గడిపినా.. తర్వాత దానిని వీరిద్దరూ పబ్లిక్ చేసేసారు.
వెకేషన్స్ లో ఫోటో షూట్స్, బర్త్ డేస్ ని రెస్టారెంట్స్ లో సెలెబ్రెట్స్ చేసుకోవడం.. కలిసి ఎయిర్ పోర్ట్ లో కనిపించడం, అవార్డులకు, వెడ్డింగ్స్ కి కలిసి హాజరవడం ఇలా అన్నీ పబ్లిక్ గానే చేస్తున్న ఈ జంట రీసెంట్ గా బ్రేకప్ చెప్పుకుంది అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూసింది. కారణం మలైకా అరోరా కొద్దిరోజుల క్రితం అర్జున్ కపూర్ ని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసి షాకివ్వడమే కాదు.. అతని స్టెప్ సిస్టర్ జాన్వీ కపూర్ ని కూడా అన్ ఫాలో చెయ్యడంతో మలైకాకి అర్జున్ కపూర్ కి చెడింది అనుకున్నారు.
తాజాగా ముంబైలో ఓ రెస్టారెంట్ లో డిన్నర్ చేసి బయటికొస్తూ అర్జున్ కపూర్-మలైకా అరోరాలు ఆనందంగా కనిపించడమే కాదు.. డిన్నర్ డేట్ అయ్యాక ఇద్దరూ కలిసి మలైకా ఇంటికి వెళ్లడంతో వీరి డేటింగ్ బ్రేకప్ అవ్వలేదు.. కలిసే ఉన్నారని అర్ధమయ్యింది. ఒక్క ఫొటోతో పుకార్లన్నిటికి కలిపి చెక్ పెట్టింది ఈ జంట.