లక్కీ బ్యూటీ శ్రీలీల తో నందమూరి వారసుడు కనిపించగానే.. మోక్షజ్ఞ ఇంకా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు అప్పుడే శ్రీలీల తో జత కడుతున్నాడు అనుకుంటున్నారేమో.. కాదు.. కాదు. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి మూవీ సెట్స్ కి వచ్చిన మోక్షజ్ఞ హీరోయిన్ శ్రీలీలతో మాట్లాడుతున్న పిక్ బయటికి వచ్చింది. ఎప్పుడెప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడా అని ఎదురు చూస్తున్న నందమూరి అభిమానులకి మోక్షజ్ఞ న్యూ లుక్ ఇప్పటికే ఫుల్ ట్రీట్ ఇచ్చింది. ఇప్పుడు శ్రీలీలతో మోక్షజ్ఞ మాట్లాడుతున్న పిక్ చూడగానే మా సింహం వేటకు రెడీ అంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలు పెట్టారు.
మరి గత కొన్నాళ్లుగా మోక్షజ్ఞ ని ఎప్పుడు చూసినా బబ్లీగా కనిపిస్తున్నాడు. అసలు హీరో అయ్యేందుకు ఆసక్తి లేదేమో అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తుంటే నందమూరి అభిమానుల్లో ఆందోళన ఎక్కువయ్యేది. రీసెంట్ గా సుహాసిని కొడుకు పెళ్ళిలో మోక్షజ్ఞ లుక్ చూసి హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.. ఇకపై నందమూరి మూడో తరం వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయమని అభిమానులు ఫిక్స్ అయ్యారు.
ఇంతలోనే భగవంత్ కేసరి సెట్స్ నుండి మోక్షజ్ఞ శ్రీలీలతో మాట్లాడుతున్న పిక్ రావడం.. అందులో మోక్షజ్ఞని చూసిన అభిమానులు రెచ్చిపోతున్నారు. అదే పిక్ లో దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఉన్నాడు. మరి మోక్షజ్ఞ శ్రీలీల తో ఏం మాట్లాడుతున్నాడో అంటూ మరికొంతమంది సరదాగా కామెంట్స్ కూడా చేస్తున్నారు.