Advertisementt

శ్రీలీల లో కొత్త టాలెంట్

Sun 27th Aug 2023 08:00 PM
sreeleela  శ్రీలీల లో కొత్త టాలెంట్
A new talent in Sreeleela శ్రీలీల లో కొత్త టాలెంట్
Advertisement
Ads by CJ

చాలామంది హీరోయిన్స్ మల్టీటాలెంట్స్ కలిగి ఉంటారు. పెరఫార్మెన్స్, డాన్స్, సింగింగ్ ఇలా.. శృతి హాసన్ నటన మాత్రమే కాదు.. పాటలు కూడా పాడుతుంది.. ఈ రకమైన టాలెంట్స్ చాలామందిలో ఉంటాయి. ఇప్పుడు టాలీవుడ్ ని ఏలుతున్న కుర్ర హీరోయిన్ శ్రీలీలలో కూడా మల్టి షేడ్స్ కనిపిస్తున్నాయి. డాన్స్ పరంగా టాలీవుడ్ హీరోలతో సమానంగా అదరగొట్టేస్తున్న శ్రీలీలలోని మరో టాలెంట్ స్కంద ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వేదికగా బయటికొచ్చింది. 

ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ అండ్ స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ క్రేజీగా మారిన శ్రీలీల డాన్స్ విషయంలో మిగతా టాప్ హీరోయిన్స్ కి మించిపోయి పెరఫార్మెన్స్ చూపిస్తుంది. అల్లు అర్జున్, ఎన్టీఆర్, చరణ్ ఇలా బెస్ట్ డాన్సర్స్ పక్కన శ్రీలీల కాలు కదిపితే చూడాలనే కోరికతో చాలామంది ఉన్నారు. రీసెంట్ గా స్కంద సాంగ్ లో శ్రీలీల డాన్స్ ఇరగ్గొట్టేసింది. అయితే స్కంద ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ శ్రీలీలని స్టేజ్ మీదకి పిలిచి ఆమెతో పాట పాడించాడు. శ్రీలీల అలా లైవ్ లో పాట పాడుతుంటే.. ఆమెలోని ఈ టాలెంట్ చూసి నెటిజెన్స్ మైండ్ బ్లాంక్ అయ్యింది.  శ్రీలీల గొంతు ఎంత అద్భుతంగా ఉందొ ఆ సాంగ్ విన్నవారు చెబుతున్న మాట. 

అందానికి అందం, నటనకు నటన, డాన్స్ కి డాన్స్.. చదువు కి చదువు ఇప్పుడు పాటతో శ్రీలీల తనలోని కొత్త టాలెంట్ ని బయటపెట్టి షాకిచ్చింది. నిజంగా ఇలాంటి మల్టి టాలెంటడ్ హీరోయిన్స్ చాలా రేర్ గా కనబడతారు. 

A new talent in Sreeleela:

Sreeleela Singing Songs at Skanda Event

Tags:   SREELEELA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ