కుర్ర హీరో నవీన్ పోలిశెట్టి గత వారం రోజులుగా పబ్లిక్ లోనే కనబడుతున్నాడు. కారణం అతను నటించిన మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి మూవీ ప్రమోషన్స్ కోసం. ఈ చిత్రంలో అనుష్క శెట్టి కీ రోల్ పోషించగా.. నవీన్ పోలిశెట్టి హీరోగా నటించాడు. అయితే అనుష్క ఈ సినిమా ప్రమోషన్స్ కి దూరంగా కనిపిస్తుంది. ఈమధ్యనే జరిగిన ట్రైలర్ లాంచ్ కి కూడా డుమ్మా కొట్టింది. ఇప్పుడు కూడా ప్రమోషనల్ టూర్ కి వెళ్లడం లేదు, స్టార్ హీరోయిన్ ప్రమోషనల్ టూర్స్ కి వెళ్లదులే అనుకుంటే.. అసలు ఆమె మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి ఈవెంట్స్ లో కూడా కనిపించేలా లేదు.
సెప్టెంబర్ 7 న విడుదల కాబోతున్న ఈ చిత్రనికి సంబంధించిన ఓ ఇంటర్వ్యూ కోసం అనుష్క కదలబోతున్నట్టుగా తెలుస్తుంది. కేవలం ఓ వీడియో ఇంటర్వ్యూతోనే అనుష్క ఈ మూవీ ప్రమోషన్స్ సరిపెట్టేస్తున్నట్టుగా టాక్. అదయితే పబ్లిక్ లోకి రావాల్సిన అవసరం లేదు. నవీన్ పోలిశెట్టి అనుష్క లతో ఈ వీడియో ఇంటర్వ్యూని సుమ చేయబోతుంది. అది సెప్టెంబర్ 1 న ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది.
కేవలం ఈ ఇంటర్వ్యూ తప్ప అనుష్క మరెక్కడా కనిపించదని, ఆమె పబ్లిక్ లోకి రావడానికి ఇష్టపడడం లేదు అని తెలుస్తోంది. అందుకే మేకర్స్ కూడా ఆమెని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆ వీడియో ఇంటర్వ్యూని మాత్రం స్పెషల్ గా చేయించబోతున్నారట. మిగతా ప్రమోషన్స్ అన్ని నవీన్ పోలిశెట్టి ఒంటరిగానే చక్కబెడతాడట.