లేడీ సూపర్ స్టార్ నయనతార గత ఏడాది విగ్నేష్ శివన్ ని అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నప్పటికీ.. వీరిద్దరూ ఐదేళ్ల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్టుగా.. సరోగసి పిల్లల వ్యవహారంలో బయటపెట్టి షాకిచ్చారు. ఇక అఫీషియల్ గా పెళ్లి తర్వాత హనీమూన్, అలాగే సరోగసి ద్వారా ఇద్దరి పిల్లలని ఎత్తుకున్న ఈ జంట ఎప్పుడు ఎక్కడ కలిసి కనిపించినా, లేదంటే పిల్లలతో కనిపించినా మీడియా మొత్తం వీరి వెంటే పడుతుంటుంది.
నయనతార షూటింగ్స్ లేనప్పుడు పిల్లలతో ఆడుకుంటున్న పిక్స్ ని విగ్నేష్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. అయితే తాజాగా నయనతార జంట తమ ఇంట్లో ఓనమ్ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. పిల్లలతో కలిసి ట్రెడిషనల్ గా అరిటి ఆకుల్లో భోజనం చేస్తున్న పిక్స్ తో పాటుగా.. విగ్నేష్-నయన్ ల వైట్ అండ్ వైట్ అవుట్ ఫిట్స్ లో ఉన్న రొమాంటిక్ పిక్చర్స్ ని షేర్ చేసారు.
నయనతార-విగ్నేష్ లు చాలా క్యూట్ గా బ్యూటిఫుల్ గా కనిపించారు. లవ్లీ కపుల్, అందమైన జంట అంటూ నయనతార-విగ్నేష్ జంటని చూసి నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక పిల్లల మొహాలని ఎప్పటిలాగే రివీల్ చెయ్యకుండా వెనుకవైపు ఉన్న పిక్స్ పోస్ట్ చేసారు. తమ పిల్లలు ఉయిర్, ఉలగమ్ తో నయా-విగ్నేష్ ఉన్న పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.