Advertisementt

మిగతా నటులకన్నా గొప్పోడిని కాను: బన్నీ

Sun 27th Aug 2023 10:12 AM
allu arjun  మిగతా నటులకన్నా గొప్పోడిని కాను: బన్నీ
Allu Arjun Interacting With Media మిగతా నటులకన్నా గొప్పోడిని కాను: బన్నీ
Advertisement
Ads by CJ

బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాడు. రెండు రోజుల క్రితం అల్లు వారింట్లో మొదలైన సంబరాలు స్టిల్ ఇప్పటికి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. గత రాత్రి అల్లు అర్జున్ మీడియా పీపుల్ కి అద్భుతమైన కోక్ టైల్ పార్టీ ఇచ్చాడు.హైదరాబాద్ లో జరిగిన ఈ పార్టీకి అల్లు అర్జున్ కూడా హాజరై మీడియా వారితో మట్లాడాడు. అక్కడ పార్టీలో మీడియా వారు అడిగిన ప్రశ్నలకి సరదాగా సమాధానాలిచ్చాడు. 

ఉత్తమనటుడిగా నేషనల్ అవార్డు రావడం ఎలా అనిపించింది?

అల్లు అర్జున్: నిజంగా మాటల్లో చెప్పలేని గొప్ప అనుభూతి ఇది. ఈ అవార్డు వచ్చినంత మాత్రాన నేను మిగతా నటుల కన్నా గొప్పవాడినని అనుకోవడం లేదు. తెలుగు సినిమా చరిత్రలో హేమాహేమీలైన నటులు ఎందరో ఉన్నారు. వారికి ఎందుకు ఈ అవార్డు రాలేదు? అప్పటి పరిస్థితులు ఏమిటి? అనే విషయాల మీద నాకు అంతగా అవగాహన లేదు. తెలుగువారికి ఈ అవార్డు ఎప్పుడో రావాల్సింది కదా! అని ఒక్కోసారి నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అవార్డు ప్రకటించినప్పుడు కూడా బహుశా తెలుగులో ఈ పురస్కారం గెలుచుకున్న మూడోవాడినేమో అనే అభిప్రాయంతో ఉన్నా. ఫస్ట్‌ యాక్టర్‌ నువ్వే అని అందరూ చెప్పడంతో హ్యాపీగా ఫీలయ్యాను 

జాతీయ ఉత్తమ నటుడి కేటగిరిలో మీతోపాటు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కూడా రేసులో ఉండటం ఏమైనా ఒత్తిడిగా ఫీలయ్యారా?

అల్లు అర్జున్: అలాంటిదేమీ లేదు. ఎందుకంటే ఈ కేటగిరీలో జాతీయస్థాయిలో 20కి పైగా నామినేషన్స్‌ వచ్చాయి. దక్షిణాది నుంచే కాకుండా హిందీ నుంచి కూడా నలుగురు గట్టిగా పోటీలో నిలిచారు. ఈ అవార్డు విషయంలో నేను లోకల్‌ కంటే ఓవరాల్‌ నేషనల్‌ కాంపిటీషన్‌ గురించే ఆలోచించాను.. అంటూ చెప్పుకొచ్చాడు. 

Allu Arjun Interacting With Media:

Allu Arjun Interacting With Media & Thanking Them 

Tags:   ALLU ARJUN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ