కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తెరకెక్కిస్తున్న దేవర మూవీ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. యాక్షన్ సన్నివేశాల షూటింగ్, కీలక సన్నివేశాల చిత్రీకరణ అంటూ కొరటాల దేవర షూటింగ్ షెడ్యూల్స్ ని పరుగులు పెట్టిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ పవర్ ఫుల్ విలన్ భైర గా కనబడనున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయనుంది. అయితే దేవర షూటింగ్ మొదలు పెట్టకముందే ఈఏడాది న్యూ ఇయర్ రోజున దేవర అప్ డేట్ ఇస్తూ.. దేవర ని ఏప్రిల్ 5, 2024 న విడుదల కాబోతున్నట్టుగా మేకర్స్ ఎన్టీఆర్ అభిమానులకి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు.
అయితే ఆ ఏప్రిల్ 5 కి ప్రత్యేకత ఏమి లేకపోయినా.. కొరటాల అండ్ దేవర మేకర్లు పర్ఫెక్ట్ ప్లానింగ్ తోనే దేవరకి ఆ డేట్ లాక్ చేసారు. ఏప్రిల్ 5 శుక్రవారం. తర్వాత రెండు రోజులు శని, ఆదివారాలు వీకెండ్. ఆ తర్వాత ఏప్రిల్ 9 ఉగాది, ఏప్రిల్ 11 ఈద్, ఏప్రిల్ 14 న అంబేద్కర్ జయంతి, ఏప్రిల్ 17 శ్రీరామనవమి.. ఇలా వరసగా హాలిడేస్ కలిసొచ్చేలా దేవర రిలీజ్ డేట్ ని లాక్ చేసారు మేకర్స్.
ఇది చూసిన ఎన్టీఆర్ ఫాన్స్ ఏం ప్లానింగ్ బాసు మీది.. దేవరకి ఇన్ని హాలిడేస్ కలిసొచ్చేలా, ఫ్యామిలీ ఆడియన్స్, ప్యాన్ ఇండియా ప్రేక్షకులు సరదాగా ఫెస్టివల్స్ తో పాటుగా దేవర మూవీని ఎంజాయ్ చేసే విధంగా విడుదల ప్లాన్ చేసారు అంటూ దేవర మేకర్స్ ని పొగిడేస్తున్నారు.