ప్రస్తుతం పుష్పరాజ్ నేషనల్ లెవల్లో బెస్ట్ యాక్టర్ గా అవార్డు దక్కించుకుని ఆ ఆనందంలో, ప్రశంశల జల్లులో తడిచిముద్దవుతున్నాడు. పుష్ప చిత్రానికి చిన్నపాటి ప్రమోషన్స్ తోనే ప్యాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేసి నార్త్ లో 100 కోట్లు కొల్లగొట్టి ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్ ని ఈ రోజు నేషనల్ అవార్డు వరించింది. బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ నేషనల్ అవార్డుకి ఎంపికవగా.. అల్లు అర్జున్ ఫాన్స్ ఉత్సాహంతో పండగ చేసుకుంటున్నారు.
పుష్ప పార్ట్ 1 తో పలు భాషల ప్రేక్షకులని మెప్పించిన అల్లు అర్జున్ బ్రాండ్ ప్యాన్ ఇండియా మార్కెట్ లో విపరీతంగా పెరిగిపోయింది. మరోపక్క ఈ నేషనల్ అవార్డు ప్రకటనతో అల్లు అర్జున్ క్రేజ్ ఇంకాస్త పెరగగా.. ఇదే ఊపులో పుష్ప రిలీజ్ డేట్ ఇస్తే.. సోషల్ మీడియాలో అభిమానులు రచ్చ చేసేలా ఉన్నారు. ఈమధ్యన మైత్రి వారు ఐటి రైడ్స్ తో సఫర్ అవడంతో పుష్ప 2 షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది. దానితో సుకుమార్ ప్రోపర్ గా డేట్ లాక్ చెయ్యకుండా షూటింగ్ చేసుకుంటున్నారు.
ప్యాన్ ఇండియా కాకుండా అంతకుమించి అంటే ప్యాన్ వరల్డ్ ని టచ్ అయ్యేలా పుష్ప 2 ని రిలీజ్ చెయ్యాలని దాని కోసం ఎక్కువ సమయమే పడుతుంది కాబట్టి ఇప్పటివరకు డేట్ ఇవ్వకుండా ఆగారని అంటున్నారు. వచ్చే ఏడాది మార్చ్ చివరి వారంలో పుష్ప 2 ని విడుదల చేసే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ నటించిన పుష్ప రాజ్ పాత్రకి నేషనల్ అవార్డు దక్కిన సమయంలో ఆ డేట్ ఏదో ప్రకటిస్తే మాములుగా ఉండదని అంటున్నారు. అదీ నిజమే.. చూద్దాం ఇప్పటివరకు కామ్ గా ఉన్న మేకర్స్ ఇప్పటికైనా కదులుతారేమో..!