Advertisementt

చరణ్-బన్నీ: ఇది సరిపోతుందనుకుంటా..!

Sat 26th Aug 2023 03:53 PM
ram charan  చరణ్-బన్నీ: ఇది సరిపోతుందనుకుంటా..!
Charan-Bunny: I think this is enough..! చరణ్-బన్నీ: ఇది సరిపోతుందనుకుంటా..!
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చింది.. దానితో ఇన్ సెక్యూర్ గా ఫీలవుతున్న రామ్ చరణ్.. అందుకే ఒకరోజు ఆలస్యంగా బన్నీకి విషెస్ చెప్పాడు.. బన్నీ కూడా ఏదో అలా థాంక్స్ చెప్పాడు, అల్లు అర్జున్ కి రామ్ చరణ్ కి మధ్యన నేషనల్ అవార్డు తెచ్చిన తంటా.. అబ్బో ఇలాంటి రాతలు సోషల్ మీడియా వేదికగా బోలెడన్ని కనిపించాయి.. కేవలం సోషల్ మీడియాలో విషెస్ చూసి నెటిజెన్స్ ఓ అంచనాకి రాకూడదనేది ఇప్పుడు చరణ్-బన్నీ మధ్యన ఉన్న బాండింగ్ నిరూపించింది. 

అంటే బన్నీకి నేషనల్  అవార్డు వచ్చిన సందర్భంగా రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసనలు బన్నీకి అదిరిపోయే గిఫ్ట్ పంపించారు. ఆ విషయాన్ని అల్లు అర్జున్ ఇన్స్టా స్టోరీస్ లో పోస్ట్ చేసాడు. అది చూసిన వారంతా బన్నీ-చరణ్ మధ్యన చిచ్చు పెట్టి ఆనందిద్దామనుకున్నారు.. ఇప్పుడు ఏం చేస్తారు అంటూ కామెడీగా కామెంట్ చేస్తున్నారు. 

రామ్ చరణ్-ఉపాసనలు కలిసి బన్నీకి ఓ పూలల బొకే తో పాటుగా ఓ స్పెషల్ నోట్ ని గిఫ్ట్ గా పంపించారు. ఆ నోట్ లో డియర్ బన్నీ.. కంగ్రాట్స్ నిన్ను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది.. ఇలాంటివి ఇంకా ఎన్నో నిన్ను వరిస్తాయి. అందుకు నీవు అర్హుడివి కూడా.. అని ఉపాసన పంపిన నోట్ చూసి అల్లు అర్జున్ కూడా కాస్త ఎమోషనల్ గా థాంక్యూ సో మచ్ టచ్ చేసారు అంటూ రిప్లై ఇచ్చిన స్క్రీన్ షాట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. 

Charan-Bunny: I think this is enough..!:

Ram Charan sends flowers, special note to Allu Arjun for National Award win

Tags:   RAM CHARAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ