Advertisementt

పదేళ్లయినా బోర్ కొట్టట్లేదు

Sat 26th Aug 2023 10:00 AM
rashmi  పదేళ్లయినా బోర్ కొట్టట్లేదు
Not bored even after ten years పదేళ్లయినా బోర్ కొట్టట్లేదు
Advertisement
Ads by CJ

సుడిగాలి సుధీర్-రష్మీ ఈటీవీలో ఆన్ స్క్రీన్ రొమాన్స్ మొదలు పెట్టి పదేళ్లవుతున్నా ఇప్పటికి ఆ జంట ఎక్కడ కనిపించినా ఫ్రెష్ గానే కనిపిస్తున్నారు తప్ప బోర్ కొట్టడం లేదు అంటూ బుల్లితెర ఆడియన్స్ చెబుతున్నారు. ఈటీవీలో అనసూయని తప్పించి యాంకర్ గా రష్మిని జబర్దస్త్ యాజమాన్యం తీసుకొచ్చాక, సుధీర్ కూడా కమెడియన్ గా నిలదొక్కుకుంటున్న సమయంలో వారు ఆన్ స్క్రీన్ రొమాన్స్ మొదలు పెట్టారు. మొదట్లో అది నిజం కాదేమో అనుకున్నా.. రాను రాను వారి బిహేవియర్ తో అది నిజమనేలా నమ్మించారు. అంతలా  వారి మద్యన బాండింగ్ చూపించేవారు. 

నిన్నమొన్నటివరకు వాళ్లిద్దరూ అసలు సిసలైన ప్రేమికులే అనుకున్నారు. ఈటివి వీళ్ళకి చాలాసార్లు పెళ్లి కూడా చేసింది. స్పెషల్ ప్రోగ్రామ్స్ లో డాన్స్ లతో వారి మధ్యన కెమిస్రి చూపించేవారు. కాని తాము రియల్ లైఫ్ లో లవర్స్ కాదని రష్మీ-సుధీర్ లు కుండబద్దలు కొట్టడమే కాదు. కొన్నాళ్లుగా వీరిద్దరూ కలిసి పని చెయ్యడం లేదు. మళ్ళీ ఎక్కడ కలిసి స్టేజ్ పై కనిపించినా అదే ఫ్రెష్ నెస్ తీసుకొస్తారు.

జబర్దస్త్ నుండి బయటికి వెళ్ళిపోయి సినిమా హీరోగా సెటిల్ అవుతున్న సుధీర్ తాజాగా ఈటివి 28 ఇయర్స్ సెలెబ్రేషన్స్ కోసం యాంకర్ అవతారమెత్తాడు. ఆ స్టేజ్ పై రష్మీ తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూపించాడు. అబ్బా ఎన్నిసార్లు చూసినా వీరేనా అనుకునేలా కాకుండా.. మళ్ళీ కొత్తగా కనిపింఛారు. వీరిద్దరూ నిజమైన లవర్స్ అనుకునేలా మళ్ళీ మళ్ళీ రొమాన్స్ పండించారు. ఈ వేడుకల్లో సుధీర్-రష్మీ డాన్స్, వీరి కాంబో కామెడీ మెయిన్ హైలెట్ అనేలా వదిలిన ప్రోమోస్ వైరల్ అయ్యాయి. 

Not bored even after ten years:

Rashmi-Sudheer once again romance in ETV 28 years celebration

Tags:   RASHMI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ