శర్వానంద్ ఈమధ్యన పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఇంతలోపులో ఆపరేషన్ ఏమిటో అని ఆయన అభిమానులు ఒకింత కంగారు పడుతున్నారు. శర్వానంద్ తాను ప్రేమించిన అమ్మాయి రక్షిత రెడ్డిని వివాహమాడాడు. కెరీర్ పరంగా ఒకే ఒక జీవితంతో హిట్ కొట్టిన శర్వానంద్ ఇప్పుడు బేబీ ఆన్ బోర్డు అనే మూవీ చేస్తున్నాడు. అయితే ఈ చిత్ర షూటింగ్ కి కాస్త గ్యాప్ ఇచ్చి శర్వానంద్ అమెరికా వెళ్లనున్నాడట.
కారణం శర్వానంద్ ఓ ఆపరేషన్ కోసమే అమెరికా వెళ్లినట్లుగా తెలుస్తుంది. ఈ ఆపరేషన్ న్యూస్ చూసాక శర్వా అభిమానులు కొద్దిగా ఆందోళపడుతున్నారు. అయితే శర్వానంద్ ఆపరేషన్ ఏమి ప్రమాదకరం కాదు అని, ఆయన జాను సినిమా సమయంలో ఎత్తు ప్రదేశం నుండి కిందపడిపోవడంతో అప్పట్లో భుజానికి గాయమైంది, అలాగే దెబ్బలు, ఆ గాయం తగ్గినప్పటికీ.. ఇప్పటికి దాని వలన నెప్పి భరిస్తున్నాడట శర్వా.
దాని శాశ్వత పరిష్కారం కోసమే శర్వానంద్ అమెరికా వెళ్లాడని తెలుస్తుంది. అమెరికాలోనే శర్వానంద్ సర్జరీ చేయించుకుని కొద్దిపాటి రెస్ట్ తో మళ్ళీ ఇండియాలో అడుగుపెడతాడని, ఆ తర్వాత బేబీ ఆన్ బోర్డు సెట్స్ లో జాయిన్ అవుతాడని తెలుస్తుంది.