అల్లు అర్జున్ ప్రస్తుతం ప్రశంశల జల్లులో తడిచిముద్దవుతున్నాడు. పుష్ప సినిమాలో పుష్పరాజ్ పాత్రకి నేషనల్ అవార్డు రావడం పట్ల ఆయన ఎంతగా సంతోషపడుతున్నాడో తెలియదు కానీ ఆయన చుట్టూ ఉన్నవారికి అంతకు మించిన సంతోషం కలిగింది. నిన్న ఆగష్టు 24న అల్లు అర్జున్ ని ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు కమిటి మెంబెర్స్ ప్రకటించిన దగ్గర నుండి ఆయన ఇంటి దగ్గర కోలాహలం కనిపిస్తుంది. అల్లు అర్జున్ ఫ్రెండ్స్, గీత ఆర్ట్స్ సభ్యులు, అల్లు అరవింద్ సన్నిహితులు ఫ్యామిలీ మెంబెర్స్, అలాగే సన్మానాలు, హగ్స్ తో అల్లు అర్జున్ తడిచిపోతున్నాడు.
ఇక ఈరోజు అల్లు అర్జున్ ఒంటరిగా బ్రహ్మి ఇంటికి వెళ్ళాడు. ఆయన కొడుకు సిద్దార్ట్ వివాహానికి హాజరు కాలేకపోవడంతో ఈ రోజు బ్రహ్మానందంఇంటికి స్వయంగా వెళ్లి నూతన వధూవరులని కలిసిన అల్లు అర్జున్ కి స్పెషల్ సన్మానం చేసారు బ్రహ్మి. అయితే నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్ గా అల్లు అర్జున్ ఇప్పుడు టాలీవుడ్ మీడియాకి ఓ స్పెషల్ పార్టీ అరేంజ్ చేసాడు. ఈ రోజు ఆగష్టు 25 న అల్లు అర్జున్ మీడియా ప్రతినిధులకు స్పెషల్ కాక్ టైల్ పార్టీ ఎరేంజ్ చేసారు.
కానీ మీడియా వారు ఈరోజు చెన్నై కి వెళ్లడంతో అల్లు అర్జున్ పార్టీని పోస్ట్ పోన్ చేసారు. చంద్రముఖి 2 ఆడియో లాంచ్ వేడుక కోసం టాలీవుడ్ మీడియా జర్నలిస్ట్ లు చాలామంది చెన్నైకి వెళ్లిపోవడంతో.. ఈరోజు జరగాల్సిన అల్లు అర్జున్ స్పెషల్ కాక్ టైల్ పార్టీ రేపు శనివారం సాయంత్రానికి వాయిదా పడింది. మరి అల్లు అర్జున్ ఎంత హ్యాపీగా లేకపోతె ఈ పార్టీ అరేంజ్ చేసి ఉంటారో ఊహించండి.