Advertisementt

ప్ర‌తి లుక్‌కీ ఓ ప్రాముఖ్య‌త ఉంది - జ‌వాన్

Fri 25th Aug 2023 04:50 PM
jawan  ప్ర‌తి లుక్‌కీ ఓ ప్రాముఖ్య‌త ఉంది - జ‌వాన్
SRK unveils the many faces of justice! Drops a multifaceted poster of Jawan ప్ర‌తి లుక్‌కీ ఓ ప్రాముఖ్య‌త ఉంది - జ‌వాన్
Advertisement
Ads by CJ

మీ కేలండ‌ర్ల‌లో సెప్టెంబ‌ర్ 7ని మార్క్ చేసుకోండి. ఎస్ ఆర్ కె లోని ప‌లు పార్వ్శాల‌ను తెర‌మీద ఆవిష్క‌రించబోయేది ఆ రోజే!

షారుఖ్ ఖాన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న సినిమా జ‌వాన్‌. న‌య‌న‌తార నాయిక‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమా ప్రివ్యూ ఇటీవ‌ల విడుద‌లైంది. ఆ రోజు నుంచే షారుఖ్‌ఖాన్ తెర మీద ఎన్ని కోణాల్లో క‌నిపిస్తారోన‌నే ఉత్కంఠ స‌ర్వ‌త్రా వ్యాపించింది. 

ఈ సినిమాలో యాక్ష‌న్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్ప‌క‌నే చెప్పింది ప్రివ్యూ. యాక్ష‌న్ గురించి జ‌నాలు ఎంత‌గా మాట్లాడుకుంటున్నారో, జ‌వాన్ సినిమాలో షారుఖ్‌ఖాన్ ఎన్ని గెట‌ప్పుల్లో క‌నిపిస్తారోన‌నే విష‌యం గురించి కూడా అంతే క్యూరియాసిటీతో మాట్లాడుకుంటున్నారు. అత‌ని గెట‌ప్పుల వెనుక ఉన్న క‌థ‌ల గురించి ఆస‌క్తిక‌రంగా ఆరా తీస్తున్నారు. 

సినిమాలోని ఆయ‌న గెట‌ప్పుల‌న్నిటినీ సింగిల్ ఫ్రేమ్‌లోకి తెచ్చే విధంగా కొత్త పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఇందులోని ఐదు డిఫ‌రెంట్ లుక్స్ ప్రేక్ష‌కుల‌ను అబ్బుర‌ప‌రుస్తున్నాయి. ఒక‌దానితో ఇంకోదానికి పోలిక లేకుండా, ప్ర‌తి అవ‌తార్‌లోనూ త‌నకు తానే సాటి అన్నంత వైవిధ్యంతో మెప్పిస్తున్నారు షారుఖ్‌. 

ఈ పోస్ట‌ర్ చూసిన ప్ర‌తి ఒక్క‌రూ షారుఖ్ ఖాన్ నెవ‌ర్ సీన్ బిఫోర్ అవ‌తార్‌లో ప్రేక్ష‌కుల‌కు క‌న్నుల‌పండుగ క‌లిగాస్తార‌ని సంతోషిస్తున్నారు. 

సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా?  థియేట‌ర్ల‌కు వెళ్దామా? అని ఎదురుచూస్తున్నారు.

జ‌వాన్ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ స‌గ‌ర్వంగా స‌మ‌ర్పిస్తోంది. అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. గౌర‌వ్ వ‌ర్మ స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 7న ప్ర‌పంచ‌వ్యాప్తంగా హిందీ, తెలుగు, త‌మిళ్‌లో విడుద‌ల కానుంది జ‌వాన్‌.

SRK unveils the many faces of justice! Drops a multifaceted poster of Jawan:

Jawan new poster

Tags:   JAWAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ