వరుణ్ తేజ్-సాక్షి వైదే జంటగా ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన గాండీవధార అర్జున నేడు ఆగష్టు 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి షోకే సినిమాపై నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వ లోపాలు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయని, ఘోస్ట్ కన్నా ఈ చిత్రం మరింతగా వీక్ అని క్రిటిక్స్ రివ్యూస్ ఇస్తుంటే.. పబ్లిక్ కూడా సినిమాలో ఎలాంటి విషయము లేదని తేల్చేస్తున్నారు.
ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన గాండీవధార అర్జున చిత్రం థియేటర్స్ లో విడుదల కాకమునుపే ఈ చిత్రంపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఆ పోటీలో భాగంగానే ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు దక్కించుకుంది.
అయితే నెట్ ఫ్లిక్స్ వారు ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలతో ఒప్పందం చేసుకున్నారట. ఈరోజు ఆగస్టు 25న విడుదలైన గాండీవధారి అర్జున సెప్టెంబర్ చివరి వారంలో ఓటిటీ ప్రేక్షకుల ముందుకు వస్తుందని సమాచారం.