Advertisementt

ఒక్క నెలలో మూడు మెగా మూవీస్ రిజల్ట్

Fri 25th Aug 2023 01:33 PM
mega heroes  ఒక్క నెలలో మూడు మెగా మూవీస్ రిజల్ట్
Result of three mega movies in one month ఒక్క నెలలో మూడు మెగా మూవీస్ రిజల్ట్
Advertisement
Ads by CJ

జులై 28 నుండి ఆగష్టు 25 వరకు మెగా హీరోలు ఓ నెల పాటు బాక్సాఫీసుని కబ్జా చేసారు.. జులై 28 న పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి తేజ్ తో కలిసి బ్రో మూవీ తో వస్తే.. ఆగస్టు 11 న మెగాస్టార్ చిరు భోళా శంకరుడిగా దిగారు. ఆయన వచ్చిన రెండు వారాలకి వరుణ్ తేజ్ గాండీవధార అర్జున తో వచ్చేసాడు. 

జులై 28 న పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల కలయికలో క్రేజీ మూవీగా ఆడియన్స్ ముందుకు వచ్చిన బ్రో రిజల్ట్ ఏమిటనేది అందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ స్టామినా కూడా బ్రో ని కాపాడలేపోయింది. దానితో మెగా ఫ్యామిలిలో ఆ నెలలో పవన్-సాయి తేజ్ లు మొదటి ప్లాప్ ని నమోదు చేసారు. 

ఇక ఎన్నో అంచనాలు మద్యన వచ్చిన మెగాస్టార్ భోళా శంకర్ పరిస్థితి కూడా తెలిసిందే. వేదాళం రీమేక్ గా తెరకెక్కిన భోళా శంకర్ ని ఆడియన్స్ యాక్సప్ట్ చెయ్యలేదు. దానితో అది డిసాస్టర్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. మరి రెండు వారాల్లోనే మెగా ఫ్యామిలీ హీరోలు బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ లు చవి చూసారు. 

ఈరోజు ఆగష్టు 25 న విడుదలైన వరుణ్ తేజ్ గాండీవధార అర్జున రిజల్ట్ ఏమిటనేది క్రిటిక్స్ రివ్యూస్ చూస్తే ఓ అంచనాకి వచ్చేస్తారు. ఒక్క నెలలో నలుగురు మెగా హీరోలు వరసగా ప్లాప్ లు కొట్టారు. ఒక్కరు కూడా సక్సెస్ ని చూడలేకపోయారు. మరి నవంబర్ 10 న రాబోయే వైష్ణవ్ తేజ్ ఆదికేశవ పరిస్థితి ఏమిటో చూడాలి. 

Result of three mega movies in one month:

Mega Heroes Movies in 1 motnh

Tags:   MEGA HEROES
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ