ఈ నేషనల్ అవార్డు కమిటీకి ప్రభాస్ కష్టం, ప్రతిభ ఏమి కనిపించలేదా? ఇప్పుడు ఇదే ప్రభాస్ అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్న. బాహుబలి రెండు పార్టులతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులని సంపాదించుకోవడం ఒక ఎత్తైతే.. ఐదేళ్ల పాటు ప్రభాస్ బాహుబలి పాత్రలో ఎంతో శ్రమించాడు.. కానీ ప్రభాస్ ప్రతిభని ఏ కమిటీ గుర్తించలేదు. ఈ నేషనల్ అవార్డ్స్ కమిటీ అప్పుడేమయ్యింది.. అంటూ ప్రభాస్ ఫాన్స్ తెగ బాధపడుతున్నారు.
అల్లు అర్జున్‌కి అవార్డు వచ్చినందుకు కాదు.. అప్పట్లో ప్రభాస్‌ని గుర్తించనందుకు ప్రభాస్ ఫాన్స్ నేషనల్ అవార్డు కమిటీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి లాంటి భారీ సినిమాతో మొట్టమొదటి పాన్ ఇండియా హిట్ కొట్టి ఇప్పటికీ తన రికార్డ్‌ని పదిలంగా కాపాడుకుంటున్న ప్రభాస్ స్టామినాని కమిటీ చూడలేకపోయిందా.. లేదంటే మరేదన్నా కారణం ఉందా.. ఏదైనా జరిగిందా..? అంటూ ప్రభాస్ ఫాన్స్ కాస్త మదనపడుతున్నారు.
వాస్తవంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని, స్థానాన్ని ప్రపంచానికి చాటిన చిత్రం బాహుబలి. ఆ సినిమా తర్వాతే అంతా తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారు. ఆ సినిమాలో ప్రభాస్ నటనకు నిజంగానే జనాలు నీరాజనాలు పలికారు. కానీ, ప్రభాస్‌ని మాత్రం జాతీయ అవార్డ్ కమిటీ పట్టించుకోలేదు. ఇదే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఆగ్రహం తెప్పిస్తుంది. అందులో బీజేపీ ప్రభుత్వానికి కూడా ప్రభాస్ చాలా సపోర్టివ్‌గా ఉన్నారు. ఒకవేళ అదే కారణం అయిందేమో.. పార్టీ మనిషికి ఇచ్చుకున్నారని.. ప్రభాస్‌ని పట్టించుకోలేదేమో.. అనేలా కూడా కొందరు కామెంట్స్ చేస్తుండం విశేషం.