Advertisementt

ఇప్పుడు ఫీలవుతున్న మహేష్ ఫాన్స్

Thu 24th Aug 2023 09:16 PM
mahesh fans  ఇప్పుడు ఫీలవుతున్న మహేష్ ఫాన్స్
Mahesh fans who are regretting now ఇప్పుడు ఫీలవుతున్న మహేష్ ఫాన్స్
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రావడమేమో గాని.. ఇప్పుడు మహేష్ ఫాన్స్ తెగ ఫీలవుతున్నారు. మహేష్ ఫాన్స్ మాత్రమే కాదు.. చాలామంది నెటిజెన్స్ మహేష్ నేషనల్ అవార్డు మిస్ చేసుకున్నాడంటూ గతంలో సుకుమార్ తో తన ప్రాజెక్ట్ ఆగిపోయింది అని, కొన్ని టెక్నీకల్ ఇష్యుస్ వలన తమ ప్రాజెక్ట్ ముందుకు సాగడం లేదు అంటూ మహేష్ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ని ఇప్పుడు వైరల్ చేస్తూ ఆడేసుకుంటున్నారు. 

అసలు ఇప్పుడు మహేష్ ఫాన్స్ ఎందుకు అంతగా ఫీలవుతున్నారంటే.. పుష్ప చిత్రాన్ని మహేష్ తో చెయ్యాలని సుకుమార్ ముందు మహేష్ నే కలిశారు. అప్పటికే వారి ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్సమెంట్ వచ్చేసింది. కానీ మహేష్ కి పుష్ప రాజ్ గెటప్ నచ్చకపోవడం వలనే పుష్ప చిత్రం చెయ్యనని సుకుమార్ తో చెప్పేసి సైలెంట్ గా తప్పుకోకుండా టెక్నీకల్ రీజన్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం అప్పట్లో సంచలనం అయ్యింది. 

ఇప్పుడు అదే సుకుమార్ అల్లు అర్జున్ తో పుష్ప సినిమా తీసి ప్యాన్ ఇండియా మార్కెట్ లో రిలీజ్ చేసి నేడు నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నాడు. మహేష్ గనక పుష్ప సినిమా చేసుంటే ఈరోజు మహేష్ ఫాన్స్ సంబరాలు చేసుకునేవారు. ఆ నేషనల్ అవార్డు మహేష్ సొంతమయ్యేది.. కానీ ఇప్పుడు అది మిస్ అయ్యింది. అదే మహేష్ అభిమానులు మధనపడుతున్న విషయం. 

Mahesh fans who are regretting now:

Disappointment For Mahesh Fans 

Tags:   MAHESH FANS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ